Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Arjun Tendulkar: సచిన్ కోడలు ఆస్థి ఎంతో తెలుసా?

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనువరాలు సానియా చందోక్‌‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటికే అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌తో నిశ్చితార్థం జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ ఎంగేజ్‌‌మెంట్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అర్జున్ సానియా చందోక్‌‌‌లు సుదీర్ఘ కాలంగా ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతోనే పెళ్లి చేసేందుకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి సానియా చందోక్.. అర్జున్ టెండూల్కర్ సోదరి సారా టెండూల్కర్ స్నేహితురాలు. ఈ ఇద్దరూ లండన్‌లో చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్‌గా మారారు. సారా టెండూల్కర్ కోసం వచ్చే క్రమంలో సానియా చందోక్‌ను అర్జున్ టెండూల్కర్ ప్రేమలోకి దింపాడట. ఈ విషయం మూడో కంటికి తెలియకుండా ఈ ఇద్దరూ జాగ్రత్తపడినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలిసి సారా టెండూల్కర్ కూడా అవాక్కైంది. ఆమెతో పాటు సచిన్ కూడా ఆశ్చర్యపోయినట్లు వార్తలు వచ్చాయి.

Arjun Tendulkar s Fianc e Saniya Chandokh s Family Net Worth Estimated at 624 Crore

సచిన్ కాబోయే కోడలు సానియా చందోక్ నెట్ వర్త్ రూ. 624 కోట్లుగా అంచనా వేయబడింది. ఆమె కుటుంబానికి అనేక వ్యాపారాలు ఉన్నాయి. ముంబైలో ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌ ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో వారి ఆదాయం 20 శాతం పెరిగింది. దీని ద్వారా వార్షిక ఆదాయం రూ. 624 కోట్లుగా అంచనా వేయబడింది. అదే విధంగా సానియా..పెంపుడు జంతువుల క్లినిక్‌ను నిర్వహిస్తోంది. దీని విలువ రూ. 4.37 కోట్లుగా అంచనా వేయబడింది. సచిన్ టెండూల్కర్ నెట్‌వర్త్ రూ. 1400 కోట్లుగా అంచనా వేయబడింది. సానియా సాయంతో అర్జున్ టెండూల్కర్ ఈ ఆస్థిని మరింత పెంచుతాడనే చర్చ జోరుగా సాగుతోంది.

Story first published: Sunday, August 24, 2025, 17:32 [IST]
Other articles published on Aug 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+