For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Arjun Tendulkar: సచిన్ కొడుకు సంచలన బౌలింగ్!

క్రికెట్ గాడ్, భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సంచలన బౌలింగ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. అప్‌కమింగ్ డొమెస్టిక్ సీజన్ ముందు అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌లో సచిన్ టెండూల్కర్ బంతితో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.

ఈ టోర్నీలో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్.. ఆతిథ్య కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల ఘనతను అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అర్జున్ టెండూల్కర్.. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో కర్ణాటక పతనాన్ని శాసించాడు. అర్జున్ టెండూల్కర్ సంచలన బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో గోవా ఇన్నింగ్స్ 189 పరుగుల తేడాతో కర్ణాటకను చిత్తు చేసింది.

Arjun Tendulkar Picks 9-Wicket Haul For Goa CA XI

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక అర్జున్ టెండూల్కర్(5/41) ధాటికి 103 పరుగులకే కుప్పకూలింది. ఈ ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్ టెండూల్కర్ ఐదు వికెట్లతో కర్ణాటక పతనాన్ని శాసించాడు. అనంతరం గోవా తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభినవ్ తేజ్ రాణా(109) సెంచరీతో రాణించగా.. మంతన్ కుట్కర్ (69) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

310 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. అర్జున్ టెండూల్కర్(4/46) ధాటికి 121 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. ఈ ఇన్నింగ్స్‌లోనూ 13.3 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్ టెండూల్కర్.. ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అర్జున్ టెండూల్కర్ 26.3 ఓవర్లు బౌలింగ్ చేసి 87 పరుగులు ఇచ్చి 9 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.

దేశవాళీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 49 మ్యాచ్‌లే ఆడిన అర్జున్ టెండూల్కర్.. 68 వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ మీడియం పేసర్ అయిన అర్జున్ టెండూల్కర్ తన కెరీర్‌లో 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు తీసాడు. అప్‌కమింగ్ రంజీ ట్రోఫీ ముందు ఈ ప్రదర్శన అర్జున్ టెండూల్కర్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయనుంది.

ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్‌ పర్యవేక్షణలో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్.. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు తీసాడు.

Story first published: Tuesday, September 17, 2024, 9:12 [IST]
Other articles published on Sep 17, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+