Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎవరికో నిరూపించుకోవడానికి ఆడటం లేదు: అర్జున్ టెండూల్కర్

క్రికెట్‌పై ఉన్న ఉన్న పిచ్చితోనే ఆడుతున్నానని, ఎవరికో ఏదో నిరూపించుకోవడానికి కాదని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. బయట వచ్చే విమర్శలను ఏ మాత్రం పట్టించుకోనని తెలిపిన అర్జున్ టెండూల్కర్.. ఆటను మెరుగుపర్చుకోవడం, ప్రాక్టీస్‌ చేయడంపైనే ఫోకస్ పెడుతానని తెలిపాడు.

ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్ట్ శుభంకర్ మిశ్రా‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ఫేవరేట్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అని చెప్పిన అర్జున్ టెండూల్కర్.. సచిన్ కొడుకుగా తనపై వచ్చే విమర్శలు, ప్రశంసలను పట్టించుకోనని స్పష్టం చేశాడు.

Arjun Tendulkar Opens Up on Sachin Comparisons I Play for Passion Not to Prove Anything to Anyone
Photo Credit: screen grab for Shubhankar Mishra Youtube

శుభంకర్ మిశ్రా‌: 'అర్జున్.. నీ విషయంలో ఎప్పుడూ పోలికలు వస్తుంటాయి. ఒక వ్యక్తిగా నాకు తెలుసుకోవాలని ఉంది. నీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పు. ఎందుకంటే నేను ఎప్పుడూ నీ స్థానంలో ఉండి ఆలోచించడానికి ప్రయత్నిస్తుంటాను. ఒక పెద్ద పేరు(సచిన్) నీకు తోడవ్వడం అనేది ఖచ్చితంగా ఒక వరమే. కానీ దాంతో పాటు కొన్ని సవాళ్లు కూడా వస్తాయి. మరి వీటిని నువ్వు మానసికంగా ఎలా ఎదుర్కొంటావు? నువ్వు బాగా ఆడినప్పుడు కూడా పోలికలు వస్తుంటాయి, అవి నువ్వు కోరుకున్నవి కాకపోయినా సరే.?

అర్జున్ టెండూల్కర్: 'నేను క్రికెట్‌ను నా అభిరుచి కోసం ఆడుతున్నాను. ఎవరికో ఏదో నిరూపించుకోవడానికి కాదు. కష్టపడటం, నా ఆటను ఆస్వాదించడం అనే ప్రక్రియపైనే నేను పూర్తిగా ఫోకస్ పెడుతాను. బయటి విమర్శలు, పోలికలను ఏ మాత్రం పట్టించుకోను.

శుభంకర్ మిశ్రా‌: నువ్వు ముంబై ఇండియన్స్ తరపున కొన్ని మ్యాచ్‌లు ఆడావు. బాగా బౌలింగ్ కూడా చేశావు. నీ స్వింగ్ బాగుంది. మరి నీకు ఇంకా ఎక్కువ అవకాశాలు వచ్చి ఉండాలని అనిపించిందా?

అర్జున్ టెండూల్కర్: 'ఎవరికి అలా అనిపించదు? బెంచ్‌ మీద కూర్చోవాలని ఎవరూ అనుకోరు. కానీ మేం కష్టపడాలని, అవకాశం వచ్చినప్పుడు మంచి ప్రదర్శన చేయాలని అనుకుంటాం.

శుభంకర్ మిశ్రా‌: దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టు నుంచి గోవాకు ఎందుకు మారావు?

అర్జున్ టెండూల్కర్: ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం కోసం ముంబై రంజీ జట్టు నుంచి గోవా జట్టుకు మారాను. ఇది నా కెరీర్‌లో తీసుకున్న కీలక నిర్ణయం. గోవా జట్టులో తనకు రెగ్యులర్‌గా ఆడే అవకాశం దొరుకుతోంది.

శుభంకర్ మిశ్రా‌: యో-యో టెస్ట్, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తావా?

అర్జున్ టెండూల్కర్: నేను ఫిట్‌నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటాను. యో-యో టెస్టుల్లో ఎప్పుడూ మంచి స్కోరు సాధిస్తాను. ఫాస్ట్ బౌలర్‌గా రాణించాలంటే ఫిట్‌నెస్ అత్యంత ముఖ్యమని నమ్ముతాను

శుభంకర్ మిశ్రా‌: తండ్రిగా సచిన్ టెండూల్కర్ మీకు ఇచ్చే సలహాలు ఏంటి?

అర్జున్ టెండూల్కర్: ఆటలో హెచ్చుతగ్గులు సహజమని, పట్టుదల వదలకూడదని ఎప్పుడూ మా డాడీ చెబుతుంటారు.

Story first published: Wednesday, April 1, 2026, 18:16 [IST]
Other articles published on Apr 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+