
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో నేడు జరిగే మ్యాచ్‌తో సచిన్ టెండూల్కర్ తనయుడు, ముంబై ఇండియన్స్ యువ పేసర్ అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేసే అవకాశం ఉందా? అంటే అవుననే సమాధాన వినిపిస్తోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ట్విటర్ వేదికగా షేర్ చేసిన ఓ వీడియో దీనికి బలం చేకూరుస్తోంది. అర్జున్ నెట్ ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన ఈ వీడియోలో సచిన్ తనయుడు స్టన్నింగ్ యార్కర్‌తో బ్యాటర్‌ను క్లీన్ బౌల్ట్ చేశాడు. లక్ష్యం గురితప్పలేదంటే అది అర్జునే అంటూ ముంబై ఇండియన్స్ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
దీంతో యార్కర్ ఎబిలిటీ ఉన్న అర్జున్ టెండూల్కర్ చెన్నైతో బరిలోకి దిగడం ఖాయమనే చర్చ మొదలైంది. మరోవైపు ముంబై ఇండియన్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా మినహా అంతా విఫలమవుతున్నారు. డానియల్ సామ్స్ మూడు మ్యాచ్‌లకే పరిమితమవ్వగా.. టైమిల్ మిల్స్ ధారళంగా పరుగులిస్తున్నాడు. జయదేవ్ ఉనాద్కత్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే అర్జున్ టెండూల్కర్‌కు ఓ అవకాశం ఇవ్వాలని ముంబై ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడి చతికిలపడ్డ ముంబై ఇండియన్స్.. తొలి విజయం కోసం నిరీక్షిస్తోంది. చెన్నై కూడా 6 మ్యాచ్‌ల్లో ఒక్కటే గెలిచింది. లీగ్‌లో అత్యంత విజయవంతమైన ఈ రెండు జట్ల మధ్య ఈ రోజు బిగ్ ఫైట్ జరగనుంది. ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇక ముంబై ఇండియన్స్ బౌలింగ్ వైఫల్యంతో వరుస పరాజయాలను ఎదుర్కొంటుంది. అర్జున్ టెండూల్కర్‌కు ఒక చాన్స్ ఇచ్చి చూడాలని భావిస్తోంది. మరీ అతనికి అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.