భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సహచరులుగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తే.. తాజాగా వారి వారుసులు ప్రత్యర్థులుగా తలపడ్డారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్యర్యంలో జరుగుతున్న కె తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్‌లో రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్‌ను అర్జున్ టెండూల్కర్ ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో సమిత్ ద్రవిడ్ 26 బంతుల్లో 9 పరుగులు చేశాడు. రెండు బౌండరీలు బాది క్రీజులో సెట్ అయిన సమిత్ ద్రవిడ్‌ను సచిన్ కొడకు పెవిలియన్ చేర్చాడు. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లోనే సమిత్ ద్రవిడ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఈ టోర్నీలో కర్ణాటక టాప్ ప్లేయర్లు అయిన కరుణ్ నాయర్, ప్రసిధ్ కృష్ణలు కూడా ఆడుతున్నారు. ఈ ఇద్దరూ ఇటీవలే ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు తరఫున బరిలోకి దిగారు. రంజీ ట్రోఫీ 2025-26 టోర్నీకి వార్మప్‌గా ఈ టోర్నీని ఆటగాళ్లు ఉపయోగించుకోనున్నారు.

దేశవాళీ క్రికెట్‌లో గోవాకు ఆడుతున్న అర్జున్ టెండూల్కర్.. తన ఆటను మెరుగుపర్చుకునేందుకు కష్టపడుతున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నా.. అతనికి తుది జట్టులో అవకాశాలు దక్కడం లేదు. ఈ క్రమంలోనే అప్‌కమింగ్ రంజీ ట్రోఫీ కోసం అర్జున్ సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలోనే లోకల్ టోర్నీలు ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసి కెరీర్‌లో మరింత ముందడుగు వేయాలనే లక్ష్యంతో సాగుతున్నాడు. సమిత్ ద్రవిడ్, అర్జున్ టెండూల్కర్ పోరును ఫ్యాన్స్ ఆస్వాదిస్తున్నారు.
అర్జున్ టెండూల్కర్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనువరాలు సానియా చందోక్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటికే అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌కు సీక్రెట్‌గా నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ కూడా ధృవీకరించాడు.
అయితే సానియా చందోక్.. అర్జున్ టెండూల్కర్ సోదరి సారా టెండూల్కర్‌కు క్లోజ్ ఫ్రెండ్. సారా ద్వారానే సానియా అర్జున్‌కు పరిచమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వివాహం జరిపించేందుకు సిద్దమయ్యారు. అయితే అర్జున్-సానియా ప్రేమ వ్యవహారం గురించి తెలియగానే సచిన్ టెండూల్కర్ షాక్‌కు గురయ్యారంట. ఏమాత్రం సందేహం రాకుండా అర్జున్ టెండూల్కర్ ప్రేమాయణం నడిపించాడంట. తన సోదరి సారా టెండూల్కర్‌కు కూడా తెలియకుండా మనోడు సానియాను బుట్టలో వేసుకున్నాడట. చాలా రోజులుగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నా.. సచిన్ ఫ్యామిలీ కనిపెట్టలేకపోయిందంట.