Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Arjun Tendulkar: సచిన్ కొడుకు విధ్వంసం!(వీడియో)

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ దుమ్మురేపాడు. ముంబై టీ20 లీగ్‌లో ఆల్‌రౌండ్ షో‌తో అదరగొట్టాడు. శివమ్ దూబే సారథ్యంలోని అంధేరి టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్.. సోమవారం బాంద్రా బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో సత్తా చాటి ఒంటి చేత్తో అంధేరి టీమ్‌ను గెలిపించాడు.

బౌలింగ్‌లో 3 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ 11 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసాడు. అనంతరం 145 పరుగుల ఛేదనలో 34 బంతుల్లో 5 సిక్సులు, 4 ఫోర్లతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముషీర్ ఖాన్‌(54 నాటౌట్)తో కలిసి 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Arjun Tendulkar All-Round Masterclass Powers ARCS Andheri to Emphatic Win in T20 Mumbai League 2026

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బాంద్రా బ్లాస్టర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులే చేసింది. అర్జున్‌తో పాటు ప్రసూన్ సింగ్ రెండు వికెట్లు తీసాడు. శివమ్ దూబే, అజయ్, ముషీర్ ఖాన్, ప్రజ్ఞేష్ తలో వికెట్ తీసారు. అనంతరం అంధేరి టీమ్ 13.5 ఓవర్లలో 148 పరుగులు చేసి గెలుపొందింది.

అర్జున్ సిక్సర్‌తో గాయం..

ఈ మ్యాచ్‌లో అర్జున్ బాదిన ఓ భారీ సిక్సర్.. స్టేడియంలో ఉన్న పిల్లోడి తలకు తాకింది. దాంతో మ్యాచ్ అనంతరం ఆ కుర్రాడిని ప్రత్యేకంగా కలిసిన అర్జున్ టెండూల్కర్.. ఆ చిన్నారికి ఆ బంతిపై ఆటోగ్రాఫ్ చేసి బహుమతిగా అందజేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. అర్జున్‌‌ది గొప్ప మనసు అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

ఐపీఎల్‌లో ఒకే ఒక్క మ్యాచ్..

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అర్జున్ టెండూల్కర్‌కు ఒకే ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. 13 మ్యాచ్‌ల పాటు అతను వాటర్ బాయ్‌గా జట్టుకు సేవలందించాడు.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లక్నో మేనేజ్‌మెంట్ అర్జున్‌కు అవకాశం కల్పించగా.. అతను మెరుగైన ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో ఐదు బంతులే ఆడే అవకాశం దక్కినా.. బౌలింగ్‌లో సత్తా చాటాడు. ఆ మ్యాచ్‌లో అర్జున్ ప్రదర్శనపై అతని తండ్రి సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు.

Story first published: Tuesday, June 9, 2026, 9:37 [IST]
Other articles published on Jun 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+