Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిక్సర్ల హీరో.. యువరాజ్ తండ్రి కాబోతున్నాడట

Are Yuvraj Singh and Hazel Keech expecting their first child?

ముంబై: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్‌సింగ్ తండ్రి కాబోతున్నాడా అంటే అవుననే వినిపిస్తున్నాయి. రెండేళ్ల కిందట బాలీవుడ్ నటి హేజెల్ కీచ్‌ను యువీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుక(ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ పెళ్లి)కు యువరాజ్ సింగ్, అతని భార్య హేజెల్ హాజరైయ్యారు. అక్కడి వాతావరణాన్ని బట్టి చూస్తే ఈ వార్త నిజమేననిపిస్తోంది. తమ తొలి సంతానాన్ని కలగబోతుండటంతో అక్కడ ఉన్నవారంతా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుండటంతో వాటికి యువీ ప్రశాంతత పాటించాడు. అధికారికంగా ప్రకటించేంతవరకూ తెలియకూడదని అనుకున్నాడో ఏమో...!

యువీ, కీచ్ జంటను అడిగినట్లు పత్రికలో

అక్కడికి వచ్చిన అతిథులు ఇదే విషయాన్ని యువీ, కీచ్ జంటను అడిగినట్లు ముంబై మిర్రర్ పత్రిక వెల్లడించింది. పెళ్లిలో యువీతో కలిసి దిగిన ఫొటోను హేజెల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. అదే రోజు యువీ బర్త్ డే కూడా కావడం విశేషం. ఈ సందర్భంగా హేజెల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఇలా విష్ చేసింది.

పెర్త్‌లో రెండో టెస్టు: వికెట్ తీసిన ఆంధ్ర కుర్రాడు హనుమ విహారి (వీడియో)

ప్రతి సందర్భాన్ని నవ్వుతూనే.. ఆహ్లాదకరంగా

'నేను చూసిన వారందరిలో అత్యంత మంచి వ్యక్తి. ఎప్పుడూ పద్ధతిగా కనిపిస్తాడు. ప్రతి సందర్భాన్ని నవ్వుతూనే ఎదుర్కొంటాడు. ఎప్పుడూ ప్రోత్సహిస్తూ.. సహాయం చేస్తూ.. నిస్వార్థంతో ఇతరులకు అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తాడు. నువ్వు నా జీవితాన్ని ప్రత్యేకంగా అయ్యేలా చేశావు. ప్రతి రోజూ నీకు పుట్టినరోజులా సంతోషంగా ఉండాలి. ప్రత్యేకంగా ఇవాళ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చుట్టూ ఉన్న వాతావరణమంతా నువ్వు ఉన్నందుకు ఆహ్లాదకరంగా మారిపోతుంది.' అంటూ పోస్టు ద్వారా శుభాకాంక్షలు అందజేసింది.

డిసెంబర్ 2న గోవాలో హిందూ సాంప్రదాయంలో

2016, నవంబర్ 30న యువరాజ్, హేజెల్ కీచ్ పెళ్లితో ఒకటైన విషయం తెలిసిందే. ఆ రోజు సిక్కు సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఈ జంట.. డిసెంబర్ 2న గోవాలో హిందూ సాంప్రదాయం ప్రకారం మరోసారి ఏడు అడుగులు వేశారు. రెండేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట ఆ తర్వాత పెళ్లివైపు అడుగులేశారు. 2011వ సంవత్సరంలో వారిద్దరికీ కామన్ ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకకు హాజరై మొదలైన పరిచయం ఇన్నాళ్లకు తల్లిదండ్రులుగా మారనుంది.

Story first published: Friday, December 14, 2018, 13:09 [IST]
Other articles published on Dec 14, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+