For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ, అనుష్క బాటలో రాహుల్, అతియా.. ఇక పెళ్లే ఆలస్యం!

 Are KL Rahul and Athiya Shetty making it official with their latest post?

ముంబై: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. డిన్నర్ డేట్, పబ్, పార్టీలు అంటూ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరగడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే వీరూ బాహటంగానే తిరిగినా.. తమ ప్రేమవ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.. అంగీకరించలేదు. కానీ ఆ వార్తలను మరింత బలపరిచే సన్నివేశం మరొకటి చోటుచేసుకుంది. రాహుల్‌, అతియా కలిసి తొలిసారి ఓ ప్రకటనలో నటించారు. వారిద్దరూ ఎంతో సరదాగా.. సన్నిహితంగా గడిపారు.

'నుమి ప్యారిస్' విలాసవంతమైన గాగుల్స్ యాడ్‌లో వీరిద్దరూ నటించారు. ఇదే అదనుగా అతియా తండ్రి, నటుడు సునీల్‌ శెట్టి తెరమీదకు వచ్చాడు. 'నిజంగా అద్భుతం! అతియా, రాహుల్‌.. మీరిద్దరూ ఈ సరికొత్త అవతారంలో మతి పోగొట్టారు!!!' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. దాంతో అతని గారాల పట్టి అతియా సైతం తండ్రి వ్యాఖ్యకు వెంటనే స్పందించింది. ఇక ఈ ప్రకటనకు సంబంధించిన ఫొటోపై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ క్వీన్ అనుష్క శర్మ బాటలోనే రాహుల్-అతియా నడుస్తున్నాడని, పెళ్లి చేసుకోవడమే ఆలసమ్యని కామెంట్ చేస్తున్నారు. అనుష్క శర్మ, కోహ్లీలు కూడా ఇలా ఓ అడ్వర్టైజ్‌మెంట్ షూటింగ్ కలుసుకొని.. ప్రేమించుకొని పెళ్లితో ఒక్కటయ్యారు.

ప్రస్తుతం రాహుల్‌ ఇంగ్లండ్‌లో పర్యటనలో ఉన్నాడు. ఐపీఎల్ ఆడుతుండగా అతను తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. పరీక్షించిన వైద్యులు అపెండిసైటిస్‌గా తేల్చారు. దాంతో వెంటనే శస్త్రచికిత్స చేయించుకున్నాడు. త్వరగా కోలుకొని ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ ప్రతిష్టాత్మక ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో అతనికి చోటు దక్కలేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగినా.. టీమ్‌మేనేజ్‌మెంట్ అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. బహుశా ఇంగ్లండ్‌తో ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీసులో అతనికి అవకాశాలు దక్కవచ్చు.

Story first published: Thursday, June 17, 2021, 13:56 [IST]
Other articles published on Jun 17, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+