Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రేయస్ అయ్యర్‌తో చాహల్ సతీమణి పెళ్లి? ఫొటోలు వైరల్.. నిజమిదే!

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విడాకుల వ్యవహారం నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. తమ విడాకులకు సంబంధించి చాహల్, అతతని సతీమణి ధనశ్రీ వర్మ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ ఇద్దరు విడిపోయేందుకు సిద్దమయ్యారని వారి సన్నిహితులు చెప్పారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ధనశ్రీ వర్మ ఫొటోలను తొలగించడం ఈ విడాకుల వార్తలకు బలం చేకూరింది. సోషల్ మీడియా వేదికగా విడాకుల గురించి జోరుగా ప్రచారం జరుగుతున్నా చాహల్, ధనశ్రీ వర్మ స్పందించకపోవడం కూడా ఈ వార్తలు నిజమేనని అనుకునేలా చేస్తున్నాయి.

Are Dhanashree Verma And Shreyas Iyer Dating Amid Divorce Rumours With Yuzvendra Chahal Fact Check

చాహల్ మరో అమ్మాయితో హోటల్‌‌లో కనిపించడం కూడా చర్చనీయాంశమైంది. ఈ విడాకుల వార్తలను ఆసరాగా చేసుకున్న కొందరు ఆకతాయిలు ధనశ్రీ వర్మకు సంబంధించి కొన్ని ఫేక్ ఫొటోలను నెట్టింట వైరల్ చేశారు. చాహల్‌తో విడాకులు తీసుకున్న ధనశ్రీ వర్మ.. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకుందని ప్రచారం జరుగుతోంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంతో ధనశ్రీ, శ్రేయస్ అయ్యర్ సన్నిహితంగా ఉన్న ఫొటోలను క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చాహల్‌‌కు దూరంగా ఉంటున్న ధనశ్రీ వర్మ.. శ్రేయస్ అయ్యర్‌తో వీడియో కాల్స్ మాట్లాడుతుందని ఓ వీడియోను ఏఐ సాయంతో క్రియేట్ చేసి వైరల్ చేశారు. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే ధనశ్రీ వర్మ, శ్రేయస్ అయ్యర్ పెళ్లికి సంబంధించి, వీడియో కాల్స్‌కు సంబంధించి నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలన్నీ ఫేక్. ఇవన్నీ ఏఐ సాయంతో రూపొందించినవే. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. మంచికి వాడాల్సిన సాంకేతికను కొందరు ఆకతాయిలు తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. ఏఐ సాయంతో నకిలీ ఫొటోలు, వీడియోలను సృష్టించి సెలెబ్రిటీల పరువును బజారున పడేస్తున్నారు. ఏఐ కారణంగా సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Story first published: Friday, January 10, 2025, 15:16 [IST]
Other articles published on Jan 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+