టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోల్ టైర్స్ నిలిచింది. 2027 వరకు ఈ సంస్థ టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు కారణంగా జెర్సీ స్పాన్సర్‌షిప్ డీల్‌ను డ్రీమ్ 11 రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో టీమిండియా జెర్సీ స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ 2025 టోర్నీ ఆడుతోంది. మరోవైపు భారత మహిళల జట్టు కూడా జెర్సీ స్పాన్సర్ లేకుండానే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడుతోంది.
ఓవైపు ఆసియా కప్ 2025 టోర్నీ జరుగుతుండగానే మరోవైపు కొత్త జెర్సీ స్పాన్సర్ కోసం బీసీసీఐ బిడ్స్‌ను ఆహ్వానించింది. అపోలో టైర్స్.. మ్యాచ్‌కు రూ. 4.5 కోట్లు చెల్లించేందుకు సిద్దమైంది. డ్రీమ్ 11 మ్యాచ్‌కు రూ. 4 కోట్లు చెల్లించేది. దాంతో బీసీసీఐకి కొత్త స్పాన్సర్‌షిప్ డీల్ ద్వారా మ్యాచ్‌కు రూ. 50 లక్షల ఆదాయం అదనంగా లభించింది. ఇటీవల కాలంలో అత్యంత లాభదాయకమైన స్పాన్సర్‌షిప్ ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ కొత్త ఒప్పందం 2027 వరకు కొనసాగనుంది.

టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షిప్ రేసులో అపోలో టైర్స్‌తో పాటు కాన్వా, జేకే టైర్స్ సంస్థలు కూడా నిలిచాయి. కానీ ఈ రెండు సంస్థలను వెనక్కినెట్టి అపోలో టైర్స్ డీల్ ఛేజిక్కించుకుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళల వన్డే 2025 ప్రపంచకప్‌తో అపోలో టైర్స్ జెర్సీ డీల్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.