Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

APL 2023: గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్ శుభారంభం!

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) 2023 సీజన్‌లో గోదావరి టైటాన్స్, రాయల సీమ కింగ్స్ శుభారంభం చేశాయి. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో గోదావరి టైటాన్స్ 56 పరుగుల తేడాతో వైజాగ్ వారియర్స్‌ను ఓడించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గోదావరి టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఓపెనర్ జ్ఞానేశ్వర్(53 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 80), యర సందీప్(38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీ‌లతో రాణించారు.

Rayalaseema Kings

వైజాగ్ వారియర్స్ బౌలర్లలో కార్తీక్ రామన్ రెండు వికెట్లు తీయగా.. నరసింహ రాజు, మిద్దే ఆంజనేయులు తలో వికెట్ తీసారు. అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన వైజాగ్ వారియర్స్ 17.4 ఓవర్లలో 135 పరుగులకు కుప్పకూలింది. అశ్విన్ హెబ్బార్(36), నరసింహరాజు(35) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

గోదావరి టైటాన్స్ బౌలర్లలో ఎస్‌కే ఇస్మాయిల్ మూడు వికెట్లు తీయగా.. త్రిపురణ విజయ్, శశికాంత్ రెండేసి వికెట్లు తీసారు.

రెండో మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఉత్తరాంధ్ర లయన్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఉత్తరాంధ్ర లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. శ్రీరామ వెంకట్ రాహుల్(31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. రాయలసీమ బౌలర్లలో హరిశంకర్ రెడ్డి మూడు వికెట్లు తీయగా.. బోధల కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Godavari titans

అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాయలసీమ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. తన్నీరు వంశీ కృష్ణ(34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. గిరినాథ్ రెడ్డి(32 నాటౌట్), షేక్ కామరుద్దిన్(39 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో పృథ్వీ రాజ్, తేజస్వి, తపస్వి, అయ్యప్ప, కాల్ది కుమార్ తలో వికెట్ తీసారు.

APL 2023 Results - List Of Matches

Date Day Fixture Time (IST) Result
August 16 Wednesday Coastal Riders vs Bezawada Tigers 5 PM Riders won by 12 runs
August 17 Thursday Vizag Warriors vs Godavari Titans 10 AM Titans won by 56 runs
August 17 Thursday Rayalaseema Kings vs Uttarandhra Lions 3 PM Kings won by 5 wickets
August 18 Friday Coastal Riders vs Vizag Warriors 12 PM
August 18 Friday Bezawada Tigers vs Godavari Titans 5 PM
August 19 Saturday Bezawada Tigers vs Rayalaseema Kings 10 AM
August 19 Saturday Uttarandhra Lions vs Coastal Riders 3 PM
August 20 Sunday Uttarandhra Lions vs Vizag Warriors 10 AM
August 20 Sunday Godavari Titans vs Rayalaseema Kings 3 PM
August 21 Monday Bezawada Tigers vs Uttarandhra Lions 12 PM
August 21 Monday Rayalaseema Kings vs Vizag Warriors 5 PM
August 22 Tuesday Godavari Titans vs Coastal Riders 12 PM
August 22 Tuesday Vizag Warriors vs Bezawada Tigers 5 PM
August 23 Wednesday Coastal Riders vs Rayalaseema Kings 12 PM
August 23 Wednesday Uttarandhra Lions vs Godavari Titans 5 PM
August 25 Friday Eliminator: 3rd vs 4th 12 PM
August 25 Friday Qualifier 1: 1st vs 2nd 5 PM
August 26 Saturday Qualifier 2: Eliminator Winner vs Qualifier 1 Loser 5 PM
August 27 Sunday Final: Qualifier 1 Winner vs Qualifier 2 Winner 5 PM

APL 2023 Points Table - Andhra Premier League Season 2 Standings

Position Team PLD W L NR PTS NRR
1 Godavari Titans 1 1 0 0 4 +2.800
2 Coastal Riders 1 1 0 0 4 +0.600
3 Rayalaseema Kings 1 1 0 0 4 +0.334
4 Uttarandhra Lions 1 0 1 0 0 -0.334
5 Bezwada Tigers 1 0 1 0 0 -0.600
6 Vizag Warriors 1 0 1 0 0 -2.800

PLD - Matches Played; W - Won; L - Lost; NR - No Result; NRR - Net Run Rate; PTS - Points; Q - Qualified for playoffs

Note: Points Awarded: 4 for Win, 2 for No Result and 0 for Loss. Top four on the points table after round robin stage progress to APL 2023 playoffs.

Story first published: Thursday, August 17, 2023, 21:56 [IST]
Other articles published on Aug 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+