Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

APL 2023: కోస్టల్ రైడర్స్ శుభారంభం.. బెజవాడకు తప్పని ఓటమి!

విశాఖపట్నం: ఆంధ్రప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోస్టల్ రైడర్స్ శుభారంభం చేసింది. గత సీజన్ రన్నరప్ బెజవాడ టైగర్స్‌తో బుధవారం జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కోస్టల్ రైడర్స్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోస్టర్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది.

ఓపెనర్ మన్యాల ప్రణీత్(31), మద్దిల వర్థన్(32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అండర్-19 సెన్సేషన్ కెప్టెన్ షేక్ రషీద్(20) పర్వాలేదనిపించాడు. బెజవాడ వారియర్స్ బౌలర్లలో లలిత్ మోహన్ మూడు వికెట్లు తీయగా.. కావురి సాయితేజ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెజవాడ వారియర్స్ 19.4 ఓవర్లలో 137 పరుగులకు కుప్పకూలింది.

APL 2023: coastal riders beat bezawada tigers by 12 runs

మున్నంగి అభినవ్(44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. స్టార్ బ్యాటర్లు రికీ భూయ్(3), మహీప్ కుమార్, జోగేష్(10), ప్యాల్ అవినాశ్(1), షోయబ్ మహ్మద్ ఖాన్(15) దారుణంగా విఫలమయ్యారు. చివర్లో సాయి రాహుల్(23) పోరాడినా.. మరో ఎండ్‌లో సహకారం లభించలేదు. కోస్టల్ రైడర్స్ బౌలర్లలో మనోహర్, ఆశీష్, సుదర్శన్, స్టీఫెన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఈ సీజన్ ఆరంభ వేడుకలు ఘనంగా జరిగాయి. టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల గంట కొట్టి ఈ సీజన్‌ను ప్రారంభించింది. అంతకుముందు జరిగిన ప్రారంభవేడుకల్లో ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అభిమానులకు ఫ్రీ ఎంట్రీ కల్పించారు.

అంతేకాకుండా ఈ మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానులకు లక్కీ డీప్ ద్వారా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు అందిస్తామని కూడా ప్రకటించారు. కానీ ఆశించిన ప్రేక్షకాదరణ అయితే తొలి మ్యాచ్‌కు దక్కలేదు. ఫస్ట్ మ్యాచ్ కూడా అభిమానులను నిరుత్సాహపరిచింది. టెస్ట్ తరహాలో సాగడం అభిమానులకు బోర్ తెప్పించింది. అప్‌కమింగ్ మ్యాచ్‌లు అయినా అలరించే విధంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Story first published: Wednesday, August 16, 2023, 21:22 [IST]
Other articles published on Aug 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+