APL 2022: ప్రశాంత్ అజేయ సెంచరీ.. సంతోష్ హ్యాట్రిక్! ప్లే ఆఫ్స్ చేరిన రాయలసీమ కింగ్స్!

హైదరాబాద్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ వేదికగా జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) తుది దశకు చేరుకుంది. లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడమే లక్ష్యంగా ఈ టోర్నీ నిర్వహణకు శ్రీకారం చుట్టగా తొలి ఎడిషన్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ టోర్నీలో 12 పాయింట్లతో ఉన్న రాయల సీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్.. 10 పాయిట్లతో ఉత్తరాంధ్ర లయన్స్ జట్లు ప్లే ఆఫ్స్ చేరుకోగా.. వైజాగ్ వారియర్స్ ఎనిమిది పాయింట్లు, గోదావరి టైటాన్స్ ఆరు పాయింట్లే సాధించి లీగ్ దశలోనే ఇంటి దారి పట్టాయి.
సంతోష్ హ్యాట్రిక్..
వైజాగ్ వారియర్స్‌తో బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల సీమ కింగ్స్ 7 వికెట్లతో విజయం సాధించి టోర్నీలో ముందడుగు వేసింది. వైఎస్‌ఆర్ స్టేడియంలో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వైజాగ్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 140 పరుగులు చేసింది. రాయలసీమ బౌలర్ సంతోష్ హ్యాట్రిక్ వికెట్ సాధించాడు. ఏపీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. వైజాగ్ వారియర్స్ జట్టులో దృవ్ (53), కరణ్(21), నరేన్(34)లు టాప్ స్కోరర్లుగా నిలిచారు. రాయలసీమ బౌలర్లలో సంతోష్ మూడు, వినయ్ రెండు వికెట్లు తీయగా.. గిరినాథ్, సాకేత్ చెరో వికెట్ తీశారు.
డీబీ ప్రశాంత్ సెంచరీ..
141 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన డీబీ ప్రశాంత్(56 బంతుల్లో 100 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో రాయలసీమ కింగ్స్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వైజాగ్ వారియర్స్ జట్టులో కార్తీక్, వేణు చెరో వికెట్ తీశారు.
ప్లేఆఫ్‌లు ఖరారు
ఏపీఎల్ ప్లేఆఫ్‌లో క్వాలిఫైయింగ్ తొలి మ్యాచ్‌లో బెజవాడ టైగర్స్‌తో కోస్టల్ రైడర్స్ తలపడనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్‌తో ఉత్తరాంధ్ర లయన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు క్వాలిఫైయింగ్ తొలి మ్యాచ్‌లో పరాజయం చెందిన జట్టుతో ఆడనుంది. క్వాలిఫైయింగ్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా టైటిల్ పోరుకు అర్హత సాధించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications