Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రంజీల్లో అదరగొట్టి టీమిండియాలో స్థానం పొందలేకపోయిన ముగ్గురు క్రికెటర్లు వీరే

3 Indian cricketers who were born in the wrong generation

న్యూ ఢిల్లీ: వంద కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో గల్లీకొక క్రికెటర్ పుడుతూనే ఉన్నాడు. ఇలా విపరీతమైన పోటీ పెరిగి సెలక్టర్లు ఏ సిరీస్‌కు ఎవరిని ఎంచుకోవాలో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు. అయితే ప్రతిభ ఉండి టీమిండియాలో అవకాశం రాక చాలా మంది అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవుతున్నారు. వారిలో కొందరు రంజీ ట్రోఫీల వరకైన ఆడగలిగితే మరికొందరు అక్కడ వరకూ కూడా రాక మధ్యలోనే ఆగిపోవాల్సిన దుస్థితి. అలాంటి అద్భుతమైన ముగ్గురు క్రికెటర్ల గురించి చర్చిస్తే..

అమోల్ మజుందార్:

అమోల్ మజుందార్:

భారత్ నుంచి చెప్పాలంటే అమోల్ మజుందార్ ఓ దురదృష్టవంతమైన క్రికెటర్. ముంబైకి చెందిన మజుందార్ రంజీ ట్రోఫీల్లో చేసిన రికార్డులు అమోఘమైనవి. వసీం జాఫర్ ఆడేంత వరకూ అతని రికార్డులు పదిలంగానే ఉన్నాయి. అంతటి ప్రతిభ ఉన్నప్పటికీ టీమిండియాలో స్థానం దక్కించుకోలేకపోయాడు. భారత్ బ్యాటింగ్ మంచి దశలో ఉన్నప్పుడు అమోల్ ముంబై కోసం ఆడుతున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అస్సాం.. ఆంధ్రప్రదేశ్‌లకు ప్రాతినిధ్యం వహించి రిటైరయ్యాడు. ఆయన రిటైర్ మెంట్ తర్వాత కొన్నాళ్లు కామెంటేటర్‌గానూ.. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌కు కోచ్‌గానూ వ్యవహరించాడు.

బద్రీనాథ్

బద్రీనాథ్

ఆడిన ప్రతి సీజన్‌లోనూ అద్భుతంగా రాణించాడు సుబ్రమణ్యం బద్రీనాథ్. ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు రాష్ట్రానికి పరుగుల వర్షం కురిపించేవాడు. అతని ఆటను చూసిన ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తాడని జోస్యం చెప్పేవారు. కానీ, వచ్చిన అరుదైన అవకాశాలను కూడా ఒత్తిడి లోనై సరిగా నిలబెట్టుకోలేకపోయాడు. అందులోనూ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ స్థానానికి విపరీతమైన పోటీ ఉండటంతో అతను రంజీ ట్రోపీలకే మిగిలిపోయాు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొన్నేళ్లు ఆడి ఆ తర్వాత తమిళనాడు రంజీ జట్టు నుంచి రిటైర్‌మెంట్ తీసేసుకున్నాడు.

రాజేందర్ గోయోల్:

రాజేందర్ గోయోల్:

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే 76ఏళ్ల రాజేందర్ గోయెల్ నెలకొల్పిన రికార్డులు రంజీ ట్రోఫీలో ఎవ్వరూ కదపలేకపోయారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన గోయెల్ అతని కెరీర్‌లో పంజాబ్.. హర్యానా జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో దాదాపు 750వికెట్లు తీసిన ఇతనికి ఒక్కసారి కూడా టీమిండియాలో ఆడే అవకాశం రాలేదు. దానికి కారణం బిషన్ సింగ్ బేడీ బౌలింగ్ శైలికి అతనికి వ్యత్యాసం లేకపోవడం కూడా ఓ కారణమనే చెప్పాలి. అతని గురించి ఎప్పుడు మాట్లాడినా సునీల్ గవాస్కర్ తన ఆదర్శమైన ఆటగాళ్లలో రాజేందర్ గోయెల్ కూడా ఒకరని చెప్తూ ఉంటాడు.

Story first published: Tuesday, October 9, 2018, 18:47 [IST]
Other articles published on Oct 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+