తాత స్టేడియంలో క్రికెట్ ఆడిన సీఎం వైఎస్ జగన్ (వీడియో)

కడప: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వైఎస్ రాజారెడ్డి శుక్రవారం ఏసీఏ క్రికెట్ స్టేడియం అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఫ్లడ్ లైటింగ్ పనులకు శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా బ్యాట్ పట్టిన సీఎం వైఎస్ జగన్ రెండు బంతులు ఆడి అభిమానుల్ని అలరించారు. అనంతరం బ్యాట్, బంతిపై ఆయన సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) పెద్దలు, భారత మాజీ క్రికెటర్, తెలుగు కామెంటేటర్ వేణుగోపాల్ రావు పాల్గొన్నారు. ఇక మైదానంలో వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించిన జగన్.. ఫొటో గ్యాలరీని తిలకించారు.
హరిశంకర్ రెడ్డి గురించి..
ఆంధ్ర నుంచి ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఎంపికైన కడప జిల్లాకు చెందిన హరిశంకర్ రెడ్డి గురించి ఏసీఏ అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు. అతనికి సంబంధించిన ఫొటోలను చూపించారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం సందర్శించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
సుమారు 80 ఎకరాల్లో..
కడప శివార్లలోని పుట్లంపల్లి వద్ద సుమారు 80 ఎకరాల్లో ఈ స్టేడియం నిర్మించారు. 14 ఏళ్ల క్రితం 2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ.50 లక్షలతో తన తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరిట క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ఆధ్వర్యంలో రూ. 10 కోట్లతో 2010లో రాజా రెడ్డి స్టేడియం నిర్మాణం పూర్తయింది.
ప్రస్తుతం ఇక్కడ దేశవాళీ మ్యాచ్‌లు జరుగుతుండటంతో పాటు పలువురు క్రికెటర్ల శిక్షణ కూడా తీసుకుంటున్నారు. అయితే డే అండ్ నైట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు వీలుగా సుమారు రూ.4 కోట్ల నిధులతో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేశారు.

త్వరలోనే అంతర్జాతీయ హోదా..
అయితే అతి త్వరలోనే ఈ మైదానానికి అంతర్జాతీయ హోదా దక్కనున్నట్లు తెలుస్తోంది. మైదానంలో ఫ్లడ్ లైట్ల ఏర్పాటు పూర్తయితే తెలుగురాష్ట్రాల్లో అంతర్జాతీయ మ్యాచ్‌లకు మరో స్టేడియం అందుబాటులోకి వచ్చినట్లే. ప్రస్తుతానికైతే హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియాలు మాత్రమే అంతర్జాతీయ హోదాను కలిగి ఉన్నాయి. వచ్చే ఐపీఎల్ సీజన్ వరకైనా అందుబాటులోకి తేవాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలు భావిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ హయాంలోనే ఈ మైదానానికి అంతర్జాతీయ హోదా దక్కనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications