Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కర్ణాటక కెప్టెన్‌గా ద్రవిడ్ కొడుకు.. ఆ టీమిండియా వెటరన్ ప్లేయర్‌కు చోటు!

భారత టెస్ట్ టీమ్‌లో చోటు కోల్పోయిన వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీలో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. గత సీజన్‌ వరకు విదర్భకు ఆడిన కరుణ్ నాయర్.. ఈ ఏడాది కర్ణాటకకు తిరిగొచ్చాడు. గతేడాది రంజీ ట్రోఫీలో విదర్భ విజేతగా నిలవడంలో కరుణ్ నాయర్ కీలక పాత్ర పోషించాడు.

అసాధారణ ప్రదర్శనతో 8 ఏళ్ల తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దాంతో వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో కరుణ్ నాయర్ చోటు దక్కించుకోలేకపోయాడు. కర్ణాటక జట్టులోకి కరుణ్ నాయర్ రీఎంట్రీ ఇచ్చినా.. సీనియర్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ జట్టును నడిపించనున్నాడు. కృతిక్ కృష్ణ, శిఖర్ శెట్టి, మోహ్‌సిన్ ఖాన్‌‌తో పాలు పలువురు కొత్త ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో చోటు దక్కించుకున్నాడు.

Anvay Dravid to Captain Karnataka in Vinoo Mankad Trophy Karun Nair Returns to Ranji Squad

దేశవాళీ ప్రతిష్టాత్మక అండర్ 19 ట్రోఫీ అయిన వినూ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టు‌ను రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వే ద్రవిడ్ నడిపించనున్నాడు. డెహ్రాడూన్ వేదికగా అక్టోబర్ 9 నుంచి 17 వరకు ఈ ట్రోర్నీ జరగనుంది. గత ఎడిషన్‌లో అన్వే ద్రవిడ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దాంతో ఈ సారి అతనికి కర్ణాటక సారథ్య బాధ్యతలు దక్కాయి.

కర్ణాటక రంజీ ట్రోఫీ: మయాంక్ అగర్వాల్(కెప్టెన్), కరుణ్ నాయర్, ఆర్ సమరన్, కేఎల్ శ్రిజిత్(కీపర్), శ్రేయస్ గోపాల్, వైశాఖ్ విజయ్‌కుమార్, విద్వత్ కావేరప్ప, అభిలాష్ షెట్టి, ఎమ్ వెంకటేష్, నికిన్ జోస్, అభినవ్ మనోహర్, కృతిక్ కృష్ణ(కీపర్), కేవీ అనీష్, మోహ్‌సిన్ ఖాన్, శిఖర్ శెట్టి.

కర్ణాటక వినూ మన్కడ్ ట్రోఫీ: అన్వే ద్రవిడ్(కెప్టెన్), నితీష్ ఆర్య, ఆదర్ష్ డీ ఉర్స్, ఎస్ మణికాంత్(వైస్ కెప్టెన్), ప్రణీత్ శెట్టి, వాసవ్ వెంకటేష్, అక్షత ప్రభాకర్, సీ వైభవ్, కుల్దీప్ సింగ్ పురోహిత్, రతన్ బీఆర్, వైభవ్ శర్మ, కేఏ తేజాస్, అథర్వ మల్వియా,సన్నీ కాంచీ, రెహన్ మొహమ్మద్.

Story first published: Tuesday, October 7, 2025, 10:36 [IST]
Other articles published on Oct 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+