Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కూతురి ఫోటోను షేర్‌ చేసిన అనుష్క శర్మ.. పేరేంటో తెలుసా?

Anushka Sharma Shares her daughters first Pic with Virat Kohli, Reveal babys name is Vamika

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతుల కుమార్తె తొలి ఫొటో చూడాలని అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. సోమవారం కూతురి ఫోటోను మొదటిసారిగా అనుష్క రివీల్‌ చేశారు. అంతేకాదు తన కూతురు పేరు 'వామికా' అని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ పేర్లు కలిసేలా 'వామికా' అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

వామికా సంతోషాలను రెట్టింపు చేసింది

'మేము ఎంతో ప్రేమ, అనురాగం, ఆప్యాయలతో నిండిన జీవితాన్ని గడిపాం. వామికా ఆ సంతోషాలను మరింత రెట్టింపు చేసింది. తన రాక ఎన్నో వెలుగులను తీసుకొచ్చింది. ఆనందం, కన్నీళ్లు, ఆందోళన.. ఇలా నిమిషాల వ్యవధిలోనే ఎన్నో భావోద్వేగాలు. కానీ మా హృదయం ఎంతో ప్రేమతో నిండి ఉంది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, ఆప్యాయతలకు ధన్యవాదాలు' అని అనుష్క శర్మ తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో రాసుకొచ్చారు.

జనవరి 11న

జనవరి 11న

అనుష్క శర్మ జనవరి 11న పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే తమ చిన్నారి గోప్యతకు భంగం కలగకుండా తనను సంరక్షించుకోవాలని భావిస్తున్నామని, తమ కుమార్తె ఫొటోలు తీయవద్దని విరుష్క దంపతులు ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో విరుష్క జోడి కూతురు ఎలా ఉంటుందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోమవారం అనుష్క తమ చిన్నారి ఫోటో షేర్‌ చేయడంతో ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు.

'వామికా'గా నామకరణం

'వామికా'గా నామకరణం

విరుష్క జోడి కూతురు పేరుపై మొదటి నుంచి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కోహ్లీ, అనుష్క జంటను అంతా 'విరుష్క' అని పిలుస్తుంటారు కాబట్టి ఈ పేరే పెట్టే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు. పాపకు 'అన్వీ' అనే పేరు పెడతారని కూడా మరో టాక్ వినిపించింది. Anushka పేరులోని మొదటి రెండు అక్షరాలు AN.. VIRAT పేరులోని మొదటి రెండు అక్షరాలు VI కలిపితే ANVI అవుతుంది. అయితే విరుష్క జోడి మాత్రం తమ కూతురికి 'వామికా' అని పేరు పెట్టారు.

క్వారంటైన్‌లో కోహ్లీ

క్వారంటైన్‌లో కోహ్లీ

ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో తొలిసారి కలుసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. ఐదారేళ్లు లవ్‌లో ఉన్నారు. 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడాది ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. అనుష్క శర్మ డెలివరీ సమయంలో ఆమె చెంత ఉండేందుకు పెటర్నటీ లీవ్‌పై విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేశాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్‌-ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా మొదటి టెస్టు ఆరంభంకానుంది. ఇప్పటికే చెన్నైకి చేరుకున్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉన్నాడు.

'ధోనీకి మనం చెప్పాల్సింది ఏమీ ఉండదు.. అతడికి అన్ని విషయాలు తెలుసు'

Story first published: Monday, February 1, 2021, 13:12 [IST]
Other articles published on Feb 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+