Anushka Sharma: హాఫ్ సెంచరీ బాదిన అనుష్క శర్మ.. బౌలింగ్‌లోనూ ఐదు వికెట్లు! కోహ్లీఫై సెటైర్ వేసిన బీసీసీఐ!!

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు కారణం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ట్వీటే కారణం. 'అనుష్క శర్మ: 88 బంతుల్లో 52 పరుగులు 5 ఫోర్లు, ఒక సిక్స్)' అని బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపవుతున్నారు. అనుష్క శర్మ క్రికెట్ ఆడారా?, అంతేకాకుండా అర్ధశ తకం చేసేశారా? పైగా ఐదు వికెట్లు పడగొట్టారా?.. సినిమాలోనా లేదా నిజంగానా అంటూ సోషల్ మీడియా యూసర్ల మెదడులో ప్రశ్నల మీద ప్రశ్నలు మెదులుతున్నాయి. బీసీసీఐ ఈ ట్వీట్ చేసినప్పటి నుంచి యావత్ క్రికెట్ ప్రియుల పరిస్థితి ఇలానే మారింది.
దేశవాళీ మహిళా క్రికెటర్
అయితే బీసీసీఐ పేర్కొన్న అనుష్క శర్మ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి మాత్రం కాదు. హాఫ్ సెంచరీ బాదింది, ఐదు వికెట్లు పడగొట్టింది మరెవరో కాదు.. భారత మహిళల అండర్ 19 క్రికెటర్. మహిళల అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ 2021-22 టోర్నమెంట్ మంగళవారం ఆరంభం అయింది. ఇందులో దేశవాళీ మహిళా క్రికెటర్లను టీమ్ ఏ, బీ, సీ, డీలుగా నాలుగు జట్లుగా విభజించారు. ప్రతి జట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్ రెండు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. నవంబరు 2 నుంచి 7వ తేదీ వరకు ఈ టోర్నీ సాగనుంది.
కోహ్లీఫై బీసీసీఐ సెటైర్ వేసింది
వన్డే ఛాలెంజర్ ట్రోఫీలో 'టీమ్ బి' జట్టు కెప్టెన్ పేరు అనుష్క బ్రిజ్ మోహన్ శర్మ. మంగళవారం టోర్నీలో తొలి మ్యాచ్ జరగ్గా.. బీసీసీఐ విమెన్ (BCCI Women) తమ ట్విటర్ ఖాతాలో ఓ అప్‌డేట్ ఇచ్చింది. అందులో 'అనుష్క శర్మ.. 88 బంతుల్లో 52 పరుగులు' అని రాసి ఉంది. దీంతో ఈ ట్వీట్ కాస్తా నెటిజన్లను ఆశ్చర్యానికి, అంతకుమించి గందరగోళానికి గురిచేసింది. అనుష్క పేరు చూడగానే విరాట్ కోహ్లీ సతీమణి అనే అంతా అనుకున్నారు. అంతేకాదు కోహ్లీని విమర్శించేందుకు బీసీసీఐ ఇలా ట్వీట్ చేసిందేమో అని ఫీల్ అయ్యారు.
ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు కోహ్లీని ఉద్దేశిస్తూ ఫన్నీ పోస్టులు, మీమ్స్ పెడుతున్నారు. 'అనుష్క శర్మ క్రికెట్ మ్యాచ్ ఆడిందా'?, 'అనుష్క హాఫ్ సెంచరీ చేసిందా?', 'కోహ్లీఫై బీసీసీఐ సెటైర్ వేసింది' అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
SCO vs NZ: గప్తిల్ భారీ ఇన్నింగ్స్.. స్కాట్లాండ్ ముందు టఫ్ టార్గెట్!!
ఆన్‌లైన్‌లో బెదిరింపులు
టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా జరిగిన తొలి మ్యాచులో పాకిస్తాన్, న్యూజీలాండ్ చేతిలో కోహ్లీసేన ఓడిపోయిన విషయం తెలిసిందే. దాంతో టీమిండియా రెండు వరుస పరాభవాలు ఎదుర్కొంది. బ్యాటర్లు, బౌలర్లు తేలిపోవడంతో భారత జట్టు ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా చాలా మంది దాడులు చేస్తున్నారు.
పాకిస్థాన్ చేతిలో పరాజయం తర్వాత పేసర్ మహమ్మద్ షమీని టార్గెట్ చేసిన నెటిజన్లు.. కివీస్ చేతిలో ఓడిన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేశారు. కోహ్లీతో పాటు అతడి భార్య అనుష్క శర్మ, 9 నెలల కుమార్తె వామికపై కూడా అసభ్యకర కామెంట్లు చేశారు. కోహ్లీ కుటుంబానికి ఆన్‌లైన్‌లో బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications