
హైదరాబాద్: ఐసీసీ మహిళల టీ 20 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికాపై డక్‌వర్త్‌లూయిస్ ప్రకారం 5 పరుగులతో గెలిచిన ఆస్ట్రేలియా తుది పోరుకు అర్హత సాధించగా.. భారత్ మాత్రం సెమీఫైనల్ ఆడుకుండానే టైటిల్ ఫైట్‌కు సిద్ధమైంది.
గురువారం ఇంగ్లండ్, భారత్ మధ్య జరగాల్సిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో గ్రూప్-ఎ టాపర్‌గా భారత్.. నిబంధనల ప్రకారం ఫైనల్‌కు చేరింది. దీనిపై కొందరు నెటిజన్లు, మాజీ క్రికెటర్లు విమర్శల వ్యక్తం చేస్తున్నారు. సెమీ ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేకపోవడం ఏంటని ఐసీసీపై మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మ చేసిన ట్వీట్.. నెటిజన్ల మనస్సు గెలుచుకుంది. 'వర్షం కారణంగా మనం చూడాల్సిన ఓ అత్యద్భుతమైన మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. మన అమ్మాయిలు ఫైనల్స్‌కు వెళ్లారు. ఏదేమైనా, దీన్ని మంచిగా భావిస్తూ స్వాగతిద్దాం. మార్చి 8న మ్యాచ్ కోసం ఆగలేకపోతున్నా.' అని అనుష్క ట్వీట్ చేసింది. దీనిపై సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది.
అనుష్కతో పాటు విరాట్ కోహ్లీ కూడా భారతఅమ్మాయిలను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. 'టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరిన భారత మహిళ జట్టుకు అభినందనలు. అమ్మాయిలు మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఫైనల్లో కూడా ఇదే జోరును కొనసాగించాలని కోరుకుంటున్నా. గుడ్ లక్' అంటూ ట్వీట్ చేశాడు.