అనుష్క శర్మతో పెళ్లి కోసం రాహుల్‌గా పేరు మార్చుకున్న విరాట్ కోహ్లీ..!

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతన్ని ఫాలో అయ్యే వారి సంఖ్యను చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. కేవలం క్రికెట్ ఆడే దేశాల్లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారు. శతృదేశం పాకిస్థాన్‌లోనూ కోహ్లీ అంటే పడి చచ్చే అభిమానులు ఉన్నారంటేనే అతని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నేటితో వారి వివాహా బంధానికి సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ ఐదేళ్లలో వారి బంధం మరింత బలపడింది. అందరి సెలెబ్రిటీ కపుల్స్‌లా కాకుండా చాలా అన్యోన్యంగా ఉండే ఈ ఇద్దరూ.. అందరికి స్పూర్తిదాయకంగా నిలిచారు.

విలాసంతమైన రిసార్ట్‌లో..
2017 డిసెంబర్ 11న ఇటలీలోని ఓ విలాసవంతమైన రిసార్టులో విరాట్ కోహ్లీ తన ప్రియ సఖి అనుష్క శర్మను పెళ్లి చేసుకున్నాడు. అతికొద్ది మంది ఆత్మీయులు, స్నేహితుల మధ్యనే ఈ వివాహ వేడుక జరిగింది. భారత క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్స్‌ను కూడా ఈ వివాహానికి పిలవలేదు. వివాహం అనంతరం గ్రాండ్ రిసెప్షన్ పెట్టి అందర్నీ ఆహ్వానించారు. ఇక అనుష్క శర్మతో కోహ్లీ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడనే విషయం అందరికి తెలిసినా.. వివాహానికి సంబంధించిన విషయం మాత్రం ఎవరికీ తెలియకుండా ఈ ఇద్దరు జాగ్రత్త పడ్డారు.

పేర్లు మార్చుకున్నాం..
ఎంతలా అంటే ఈ పెళ్లి కోసం వారు పేర్లు కూడా మార్చుకున్నారట. ఈ విషయాన్ని అనుష్క శర్మనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'మేం పెళ్లి ఏర్పాట్లు చేసేటప్పుడు ఫేక్ నేమ్స్‌ని వాడాం. విరాట్ కోహ్లీ తన పేరును రాహుల్‌గా మార్చు కోగా.. నా పేరును ఐశ్వర్యగా మార్చుకున్నాను.'అని అనుష్క శర్మ తెలిపింది. సదరు హోటల్ యాజమాన్యానికి కూడా జరగబోతున్నది భారత క్రికెట్ (ఇప్పుడు మాజీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల పెళ్లి అని తెలియకుండా జాగ్రత్త పడ్డారట. కోహ్లీ పెళ్లి అని ప్రపంచానికి తెలిస్తే మీడియా, అభిమానుల హడావుడి ఎక్కువగా ఉంటుందని విరుష్క జోడీ ఈ నాటకం ఆడిందంట.

అందుకే ఇటలీ..
అభిమానుల హడావుడి ఉండవద్దనే క్రికెట్ ప్రభావం తక్కువగా ఉండే ఇటలీని తమ వివాహానికి వేదికగా ఎంచుకున్నామని అనుష్క శర్మ చెప్పుకొచ్చింది. అయితే విరుష్క ఎంత జాగ్రత్తగా ఉన్నా.. పెళ్లికి సంబంధించిన వార్తలు మీడియాలో షికారు చేశాయి. అయితే అవి వాస్తవం కాదని చాలా మంది భావించినా.. పెళ్లి ఫొటోలు బయటకు రావడంతో అవి నిజమేనని అంతా నమ్మారు. విరుష్క వ్యక్తిగత సిబ్బంది మొదటగా వారి పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

లాక్‌డౌన్‌లో...
కరోనా లాక్‌డౌన్‌తో పూర్తిగా ఇంటికే పరిమితమైన విరుష్క.. ఈ సమయాన్ని సరిగ్గా వాడుకున్నారు. దాంతో వీరికి 2021 జనవరి 11న వామిక జన్మించింది. కూతురిని సోషల్ మీడియాకి దూరంగా పెంచాలని నిర్ణయం తీసుకున్న అనుష్క, విరాట్... ఆమె ఫోటోలను బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విరుష్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. జీవితాంతం ఈ ఇద్దరూ ఇలానే కలిసి ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications