
అనుష్కకు అంకితం..
దాదాపు నెల రోజులపాటు క్రికెట్ నుంచి విరామం తీసుకొని మరీ బరిలోకి దిగాడు. ఫామ్ అందుకొన్న కోహ్లీ ఆసియా కప్‌లో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల(5 మ్యాచుల్లో 276) వీరుడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సెంచరీని తన సతీమణి అనుష్కశర్మతో పాటు కూతురు వామికాకు అంకితమిచ్చాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. '70 సెంచరీలు చేసిన నాకు 71వ సెంచరీని అందుకోవడం కోసం వెయ్యి రోజులు పట్టింది. ఈ గడ్డు కాలంలో నాకు అండగా నిలబడింది నా డియర్ వైఫ్.. అనుష్క శర్మ. అందుకే సెంచరీ కాగానే మెడలో ఉన్న రింగ్‌ను కిస్ చేశా. ఆమెకు ఈ సెంచరీని అంకితమిస్తున్నా. ఆమెతో పాటు నా ముద్దుల కూతురు వామికాకు కూడా ...'' అంటూ తెలిపాడు.

ఎప్పుడూ నీతోనే డియర్..
ఇక విరాట్ కోహ్లీ సెంచరీపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవ్వగా.. అతని సతీమణి అనుష్క ఏమోషనల్ అయ్యింది. కోహ్లీ వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. 'సందర్భం ఏదైనా.. ఎలాంటిదైనా సరే.. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను.. మై లవ్'' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఒకరి కష్టాల్లో ఒకరు అండగా ఉంటున్న ఈ జోడీ చూడముచ్చటైన జంటని, ఎంతో మందికి ఆదర్శం అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

రికార్డుల రారాజు..
ఇక టీ20ల్లో తొలి సెంచరీ అందుకున్న కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 71వ సెంచరీ. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల్లో రికీ పాంటింగ్ (71)తో కోహ్లి సమంగా నిలిచాడు. అతను టెస్టుల్లో 27, వన్డేల్లో 43 సెంచరీలు చేశాడు. సచిన్ (100 సెంచరీలు) అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీకి..టీ20ల్లో ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు. టీమిండియా ఆటగాళ్లు ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో 10 సెంచరీలు నమోదు చేశారు. కోహ్లీ కంటే ముందు రోహిత్ (4 సెంచరీలు), రాహుల్ (2), రైనా, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ ఈ ఘనత సాధించారు. ఇక కోహ్లీ చివరిసారిగా 2019 నవంబర్ 23న కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై టెస్టులో సెంచరీ సాధించాడు.


Click it and Unblock the Notifications
