Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గండం గట్టెక్కిన విరాట్ కోహ్లీ?

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పెద్ద గండం గట్టెక్కాడని తెలుస్తోంది. అతని సతమణి అనుష్క శర్మ తీవ్ర అనారోగ్య సమస్యలతో రెండో బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అనుష్క శర్మ ప్రసవం లండన్‌లో జరిగినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అనుష్క అనారోగ్యం నేపథ్యంలోనే లండన్‌లో ప్రసవం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ కారణంగానే రెండో బిడ్డ పుట్టిన విషయాన్ని విరాట్ కోహ్లీ ఆలస్యంగా వెల్లడించాడట. అనుష్క అనారోగ్యానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. కోహ్లీ, అనుష్కలు ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. స్పెషలిస్ట్ వైద్యుల సమక్షంలో అనుష్క శర్మ ప్రసవం జరిగిందని, తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో కోహ్లీ ఊపిరి పీల్చుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

Anushka Sharma facing health issues? Why Virat Kohli took 5 days to reveal the news of the baby boy?

ప్రెగ్నెన్సీ సమయంలోనే అనుష్కకు అనారోగ్య సమస్యలు తలెత్తాయట. భారత్‌లోనే డెలివరీ చేయించుకుంటే.. ఆసుపత్రి ద్వారా వివరాలన్నీ బయటకు లీకయ్యే అవకాశం ఉండటంతో డెలివరీ కోసం లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. కోహ్లీ-అనుష్క లండన్ వెళ్లిన విషయంపై గతంలోనే ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా సోషల్ మీడియా వేదికగా హింట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. హర్షా గోయెంకా.. కోహ్లీ వ్యాపార భాగస్వామి కూడా.

'తండ్రిలా గొప్ప క్రికెటర్ అవుతాడా..? లేదా తల్లిలా సినీ స్టార్ అవుతాడా?' అంటూ అనుష్క, కోహ్లీ పేర్లను ప్రస్తావించకుండానే గోయెంకా పోస్ట్ చేసారు. ఈ పోస్టులో మేడిన్ ఇండియా, టు బీ బోర్న్ ఇన్ లండన్ అనే హ్యాష్ ట్యాగ్‌లను ఆయన జత చేశారు. అనుష్క అనారోగ్యంతో బాధపడుతుండటంతోనే ఏబీ డివిలియర్స్ సైతం మాట మార్చాడని తెలుస్తోంది.

ఫిబ్రవరి 15న అనుష్క శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు విరాట్ కోహ్లీ మంగళవారం(ఫిబ్రవరి 20) ప్రకటించారు. తమ వారసుడికి అకాయ్ అని పేరు పెట్టినట్లు తెలిపాడు. తమ గోప్యతకు ఇబ్బంది కలిగించవద్దని విజ్ఞప్తి చేశాడు. ఇక కోహ్లీ-అనుష్క శర్మలు లండన్‌లో స్థిరపడాలనుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

ప్రొఫెషనల్‌గా కొంత పని భారం తగ్గించుకొని.. ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోహ్లీ దంపతులు అనుకుంటున్నారని.. లండన్‌ను సెకండ్‌ హోమ్‌గా మార్చుకోవాలనే ఉద్దేశంలో వారు ఉన్నారని నేషనల్ మీడియా పేర్కొంది.

Story first published: Wednesday, February 21, 2024, 21:52 [IST]
Other articles published on Feb 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+