Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కరోనా కట్టడికి విరుష్క విరాళం!!

Anushka Sharma and Virat Kohli donate to PM-CARES fund and Maharashtra CM Relief Fund


ముంబై
: కరోనా కట్టడికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఎట్టకేలకు ముందుకు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు తమ వంతు సాయం చేస్తామని ప్రకటించారు. అయితే ఎంత సాయం చేస్తామనే విషయాన్ని మాత్రం విరుష్కా జోడీ వెల్లడించలేదు.

విరుష్కా అనే మేము హామీ ఇస్తున్నాం..

ఈ విషయాన్ని విరాట్ కోహ్లీనే ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ‘అనుష్క, నేను పీఎం కేర్స్ ఫండ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు మా వంతు సాయం చేస్తామని హామీ ఇస్తున్నాం. అలాగే సహాయ కార్యక్రమాలకు మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం. లాక్‌డౌన్ వల్ల బాధపడుతున్న చాలా మంది బాధితులను చూస్తుంటే మనందరి గుండెలు తరుక్కుపోతున్నాయి. మన ఈ సహకారం తోటి పౌరుల బాధను తగ్గించడానికి ఒక విధంగా సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము.'అని #IndiaFightsCorona యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశాడు.

అనుష్కసైతం..

ఇక అనుష్క శర్మ సైతం ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొంది. మన సహాయం ఇతరుల బాధను తగ్గిస్తుందని తెలిపింది. ఇక ఇప్పటికే యావత్ క్రీడాలోకం కరోనాపై పోరుకు తమవంతు సాయం ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. బజరంగ్ పూనియా, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, రహానే, రైనా, పీవీ సింధు, సానియామీర్జా ఇలా దేశ క్రీడాకారులందరూ.. ఎవరికీ తోచిన సాయం వారు చేస్తున్నారు. అయితే కోట్ల ఆదాయం ఉన్న కోహ్లీ ఇంకా ఎలాంటి సాయం ప్రకటించలేదే అనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఫ్యాన్స్ ఖుష్.. భేష్ అంటూ..

ఫ్యాన్స్ ఖుష్.. భేష్ అంటూ..

కోహ్లీ తాజా ప్రకటనతో సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు.. లేట్‌గా స్పందించినా పబ్లిసిటీ కోసం కాకుండా సాయం జరిగితే చాలనే విరుష్కా ఉద్దేశం భేష్ అని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కోహ్లీ బాటలోనే మిగతా క్రికెటర్లు కూడా తమకు తోచిన సాయం చేస్తున్నారని, అందరూ బహిరంగంగా చెప్పుకోవడం లేదని కామెంట్ చేస్తున్నారు. తాము కూడా తమకు తోచిన సాయం చేస్తున్నామని వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను కోహ్లీ పోస్ట్‌కు కామెంట్ల రూపంలో షేర్ చేస్తున్నారు. మీ సాయంతో మరికొంత మంది ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ విరుష్క జోడీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇక దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సంఖ్య 975కి పైగా చేరగా.. 28 మంది మరణించారు. 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన భారత ప్రభుత్వం.. కరోనాను ఎదుర్కునేందుకు ముందుకు రావాలని సెలెబ్రిటీలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల విరాళంతో యావత్ దేశ ప్రజల మనసులను గెలుచుకున్నాడు.

Story first published: Monday, March 30, 2020, 13:16 [IST]
Other articles published on Mar 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+