For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs MI: చెలరేగిన అనూజ్, కోహ్లీ.. ఆర్‌సీబీ హ్యాట్రిక్ విక్టరీ! పాపం ముంబైకి నాలుగో పరాజయం!

Anuj Rawat, Kohli power RCB to seven-wicket win

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లో ఆ జట్టు విజయాన్నందుకుంది. ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. యువ ప్లేయర్ అనూజ్ రావత్(47 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66) కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ సాధించగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(36 బంతుల్లో 5 ఫోర్లతో 48) సూపర్ బ్యాటింగ్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 151 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్).. రోహిత్ శర్మ(26), ఇషాన్ కిషన్(26) ఫర్వాలేదనిపించారు. 79 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ముంబైని.. జయదేవ్ ఉనాద్కత్(13 నాటౌట్)తో కలిసి సూర్య 7వ వికెట్‌కు అజేయంగా 72 పరుగులు జోడించాడు. బెంగళూరు బౌలర్లలో వానిందు హసరంగా, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ.. అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్‌తో 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 152 పరుగులు చేసి 9 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. చివర్లో అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్(2 బంతుల్లో సిక్స్‌తో 7 నాటౌట్), గ్లేన్ మ్యాక్స్‌వెల్(2 బంతుల్లో 2 ఫోర్లతో 8 నాటౌట్) మ్యాచ్‌ను ముంగిచేసారు.

Story first published: Saturday, April 9, 2022, 23:40 [IST]
Other articles published on Apr 9, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+