Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Anuj Rawat అదిరిపోయే కీపింగ్.. అచ్చం ధోనీ స్టైల్లో రనౌట్! (వీడియో)

జైపూర్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) యువ వికెట్ కీపర్ అనూజ్ రావత్ ఎట్టకేలకు సత్తా చాటాడు. వరుస‌గా అవకాశాలను చేజార్చుకొని కోచ్ సంజయ్ బంగర్ ఆగ్రహానికి గురైన అనూజ్ రావత్ చావో రేవో మ్యాచ్‌లో దుమ్మురేపాడు. ముందుగా బ్యాటింగ్‌లో క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించిన అనూజ్ రావత్(11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29 నాటౌట్).. అనంతరం కీపింగ్‌లో ఇరగదీశాడు.

వికెట్ల వెనుకాల దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని తలపించాడు. ఓ స్టన్నింగ్ రనౌట్‌తో పాటు కీలక క్యాచ్ అందుకొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తిట్టిన అభిమానులు, కోచ్‌లతో శభాష్ అనిపించుకున్నాడు.

 Anuj Rawat displays Dhoni-like wicketkeeping genius

ముఖ్యంగా అతను చేసిన రనౌట్ ఇంటర్నేట్‌ను షేక్ చేస్తోంది. మహేంద్ర సింగ్ ధోనీ తరహాలో సమయస్పూర్తిగా వ్యవహరించి రవిచంద్రన్ అశ్విన్‌ను డైమండ్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కాగా.. అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

కర్ణ్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదిన హెట్‌మైర్ చివరి బంతిని హెట్‌మైర్ ఆఫ్ సైడ్ ఆడి క్విక్ సింగిల్ తీసాడు. అయితే నాన్ స్ట్రైకర్ అశ్విన్ లేజీగా పరుగెత్తి మూల్యం చెల్లించుకున్నాడు. సిరాజ్ అందించిన త్రోను అనూజ్ రావత్ చాకచక్యంగా వికెట్లకు కొట్టి రనౌట్ చేశాడు.

సిరాజ్ నుంచి బంతిని అందుకున్న అనూజ్ రావత్.. ధోనీ తరహాలో కాళ్ల మధ్యలో నుంచి వికెట్లను కొట్టాడు. లేజీగా పరుగెత్తిన అశ్విన్ మిల్లీమీటర్ తేడాలో రనౌట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్ రనౌట్ కాకుంటే.. మ్యాచ్ ఇంకాసేపు జరిగి ఉండేది. దాంతో అనూజ్ రావత్‌పై ఆర్‌సీబీ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదే జోరును కొనసాగిస్తే దినేశ్ కార్తీక్ స్థానాన్ని అనూజ్ రావత్ భర్తీ చేస్తాడని అంచనా వేస్తున్నారు.

ఈ మ్యాచ్‌కు ముందు సంజయ్ బంగర్.. అనూజ్ రావత్‌ ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అనూజ్‌తో పాటు షెహ్‌బాజ్ అహ్మద్ ఎన్ని అవకాశాలు ఇచ్చినా రాణించలేకపోతున్నారని, జట్టులో ఉండి దండుగని అసహనం వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది.

Story first published: Sunday, May 14, 2023, 20:07 [IST]
Other articles published on May 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+