
సచిన్ ఒక్కడే..
రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులు విజయ లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. తీవ్ర వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నా... సచిన్ 136 పరుగులతో చెలరేగాడు. అయితే నయన్ మోంగియా (52) మినహా సహచరులంతా విఫలం కావడంతో సచిన్ చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. కానీ 254 పరుగుల వద్ద సచిన్ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడం.. ఆ తర్వాత మరో 4 పరుగుల వ్యవధిలోనే మిగిలిన 3 వికెట్లు కోల్పోయి భారత్ 12 పరుగులతో ఓడటం చక చకా జరిగిపోయాయి. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినా.. చెన్నై మైదానంలో ప్రేక్షకులు సచిన్ పోరాటానికి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇది ఆ మ్యాచ్‌కే హైలైట్.

ఓటమిని జీర్ణించుకోలేక..
ఈ విషయాన్ని నాటి భారత కోచ్ అన్షుమన్ గైక్వాడ్ ఓ సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఆ మ్యాచ్ పరిస్థితులను వెల్లడించాడు. ‘సక్లాయిన్ బౌలింగ్‌లో ఔటై మైదానం వీడిన సచిన్ తీవ్రంగా నిరాశ పడ్డాడు. భారత జట్టు ఓడిపోయిందని తెలిసిన తర్వాత అతను డ్రెస్సింగ్ రూం నుంచి బయటకే రాలేదు. ఒక టవల్‌ను అడ్డుగా పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తీసుకోలేదు..
సచినే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. కానీ దాన్ని తీసుకోవడానికి కూడా అతను వెళ్లలేదు. వేదికపైనున్న రాజ్‌సింగ్ దుంగార్పూర్ సచిన్ ఎక్కడ అంటూ అడిగినా అతని జాడే లేదు. బహుమతి ప్రదాన కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా టెండూల్కర్ తన సీటులో అలానే ఉండిపోయాడు. చివరకు నేను సముదాయించాల్సి వచ్చింది. అతను ఇలా భావోద్వేగాలు ప్రదర్శించడం ఎప్పుడూ చూడలేదు' అని నాటి ఘటనను గైక్వాడ్ వివరించారు.

ఫ్యాన్స్ విషెస్
ఇక సచిన్ నేటితో( శుక్రవారం) 47వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు. అలాగే సచిన్ గురించి గైక్వాడ్ చేసిన కామెంట్స్‌ను ప్రస్తావిస్తున్నారు. ఈ భారత రత్నం సాధించిన రికార్డులు.. అందుకున్న అవార్డులు గుర్తుచేస్తున్నారు. సచిన్ గురించి ఎక్కువగా తెలియని విషయాలను తెలియజేస్తున్నారు. సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున తన 24 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 989 మంది క్రికెటర్లతో కలిసి ఆడాడని, ఇందులో 141 మంది టీమిండియా సహచరులు కాగా... 848 మంది ప్రత్యర్థి జట్లకు చెందినవారున్నారని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications
