MS Dhoniకి బ్యాటింగ్ చేయడం రాదనుకున్నా: దక్షిణాఫ్రికా పేసర్

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బ్యాటింగ్ చేయడం రాదనుకున్నానని దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ ఆన్రిచ్ నోర్జ్ అన్నాడు. క్రీజులో పాదాలను సరిగ్గా కదిలించకపోవడంతో అలా భావించానని తెలిపాడు. అప్పటికి మహీ గురించి తనకు పూర్తిగా తెలియదని నోర్జ్ పేర్కొన్నాడు. ఆ తర్వాత తన ఆలోచన తప్పని తెలుసుకున్నట్లు వెల్లడించాడు. ధోనీ జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు.. తాను అండర్-16 విభాగంలో ఆడుతున్నానని నోర్జ్ తెలిపాడు. నోర్జ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టుకు కీలక బౌలర్ అన్న విషయం తెలిసిందే.

నెట్స్‌లో బౌలింగ్
2010 నాటి సంఘటనను తాజాగా ఆన్రిచ్ నోర్జ్ గుర్తుచేసుకున్నాడు. ఆ ఏడాది దక్షిణాఫ్రికాలో ఛాంపియన్స్ టీ20 లీగ్ జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రాంచైజ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ అందులో ఆడింది. అప్పుడు సీఎస్‌కే ఆటగాళ్లకు 16 ఏళ్ల నోర్జ్ నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. ఆ క్రమంలోనే చెన్నై కెప్టెన్, క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీకి అతడు బంతులు విరిసాడు. పదేళ్ల తర్వాత నోర్జ్ ఐపీఎల్ ఆరంగేట్రం చేశాడు. ప్రస్తుతం అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో నోర్జ్ గంటకు 150కి పైగా వేగంతో దూసుకొచ్చే బంతులను విసిరాడు.

మహీ బ్యాటింగ్ చేసేలా కనిపించలేదు
తాజాగా ఆన్రిచ్ నోర్జ్ మాట్లాడుతూ... 'అప్పట్లో నేను పెద్దవాడిని కాను. కాబట్టి ఎవరికీ భయపడేవాడిని కాదు. అప్పడు అండర్-16, అండర్-19కి ఆడుతున్నాను. నా వేగమూ ఎక్కువగా ఉండేది కాదు. 2010లో ఎంఎస్ ధోనీకి నెట్స్‌లో బౌలింగ్ చేయడం నాకు గుర్తుంది. నిజాయతీగా చెప్పాలంటే మహీ బ్యాటింగ్ చేసేలా కనిపించలేదు. అప్పుడు ధోనీ అనీ తెలియదు. పాదాలు కదపకుండానే బంతుల్ని ఆడాడు. ఆ తర్వాతే అతడెవరో, ఎంత మంచి వ్యక్తో అర్థమైంది. ధోనీ విషయంలో నేను అబద్ధం చెప్పడం లేదు. నిజంగానే నాకలా అనిపించింది' అని అన్నాడు.
ప్రేమోన్మాది చేతిలో గాయపడిన అమ్మాయికి సాయం చేసిన తెలుగు క్రికెటర్!!

16 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు
ఆన్రిచ్ నోర్జ్ 1993 నవంబరు 16న జన్మించాడు. చిన్నపటినుంచి కష్టపడేతత్వం అతడి. ఒక్కో మెట్టు ఎదుగుతూ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కెరీర్లో ఇప్పటివరకు 10 టెస్టులు (39 వికెట్లు) 9 వన్డేలు (21), 5 టీ20లు (3 వికెట్లు) దక్షిణాఫ్రికా తరఫున ఆడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నోర్జ్ .. ఇప్పటివరకు మెగా లీగ్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు తీశాడు. రెండేళ్లుగా ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. అత్యంత వేగంగా బంతులేశాడు. గతేడాది 22 వికెట్లు తీసి ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది ఆలస్యంగా రావడంతో క్వారంటైన్‌కే పరిమితం అయ్యాడు. ప్రస్తుత అతడు వెస్టిండీస్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా జట్టు విండీస్ పర్యటనలో ఉంది.

బుల్లెట్ బాల్
ఐపీఎల్ 13వ సీజన్‌లో దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఢిల్లీ పేసర్ నోర్జ్.. గంటకు 156.2 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బంతిని సంధించాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా నోర్జ్ నిలిచాడు. డేల్ స్టెయిన్ (154.4 గంటకు కిలోమీటర్లు) ఫాస్టెస్ట్ రికార్డును అతడు బ్రేక్ చేశాడు. ప్రతీ మ్యాచ్‌లో సగటున 150 ప్లస్ వేగంతో బంతులేస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మొదటి మూడు వేగవంతమైన బంతుల రికార్డు ఇప్పుడు దక్షిణాఫ్రికా పేసర్ పేరిట ఉంది. 156.2 కి.మీ, 155.21 కి.మీ, 154.74 కి.మీ వేగంతో బంతులు వేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications