Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sunrisers Hyderabadకు మరో షాక్.. స్టార్ బ్యాట్స్‌మన్‌కు గాయం!!

Another shock for Sunrisers Hyderabad, Manish Pandey Injured

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో బోణీ కొట్టాలన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌‌)‌ జట్టు కోరిక రెండో మ్యాచ్‌లోనూ నేరవేరలేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమైన సన్‌రైజర్స్‌.. శనివారం రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. టాప్ ఆర్డర్‌లో డేవిడ్ వార్నర్ పర్వాలేదనిపించగా.. మిడిల్‌ ఆర్డర్‌లో మనీశ్‌ పాండే హాఫ్ సెంచరీ బాదాడు. అయినా జట్టు విజయాన్ని అందుకోలేకపోయింది. ఎస్‌ఆర్‌హెచ్‌‌కు మిడిల్‌ ఆర్డర్‌లో బౌండరీలు బాదగలిగే బ్యాట్స్‌మెన్‌ లేకపోవడం జట్టును తీవ్రంగా వేధిస్తోంది. మరో వైపు గాయాలు కూడా ఆ జట్టుకు శాపంగా మారాయి.

పాండేకు గాయం

పాండేకు గాయం

తొలి మ్యాచ్‌లోనే ఎస్‌ఆర్‌హెచ్‌‌ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం బారినపడి టోర్నీకి దూరమయిన విషయం తెలిసిందే. కేన్ విలియమ్సన్‌ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఇక శనివారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ స్టార్ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే గాయపడ్డాడు. బౌండరీ లైన్‌కి సమీపంలో బంతిని అందుకున్న పాండే వేగంగా త్రో విసరగా.. అతని తొడ కండరాలకి గాయమైంది. గాయం కారణంగా అతడు మధ్యలోనే మైదానాన్ని వీడాడు. మళ్లీ ఫీల్డింగ్ చేయడానికి రాలేదు.

గాయంపై క్లారిటీ లేదు

గాయంపై క్లారిటీ లేదు

అబుదాబి వేదికగా మంగళవారం రాత్రి మూడో మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. అయితే మనీశ్ పాండే గాయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అతడి గాయం పెద్దదా, చిన్నదా అనే విషయం తెలియదు. ఒకవేళ పాండేకు అయిన గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే.. వచ్చే మ్యాచ్‌కి అతడు దూరం కానున్నాడు. ఇదే నిజమైతే సన్‌రైజర్స్ జట్టుకు భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే పేలవ బ్యాటింగ్‌తో పరాజయాలను ఎదుర్కొంటున్న హైదరాబాద్.. పాండే లేకుంటే ఇంకెలా ఆడుతుందో అని అభిమానులు ఆందోళన పడుతున్నారు.

ఫిట్‌నెస్ సాధించలేకపోతే

ఫిట్‌నెస్ సాధించలేకపోతే

కీలక ఆటగాడు కేన్ విలియమ్సన్‌ గాయంతో జట్టుకు దూరంగా ఉంటున్నాడు. దీంతో బ్యాటింగ్ భారమంతా ఓపెనర్లు డేవిడ్ వార్నర్‌, జానీ బెయిర్‌స్టోలపై పడుతోంది. ఓపెనింగ్ జోడి విఫలమైతే జట్టు విజయావకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. గత రెండు మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. జట్టును ఆడుకుంటున్న మనీష్ పాండేకు గాయం అయింది. మ్యాచ్ రోజుకి పాండే ఫిట్‌నెస్ సాధించలేకపోతే.. అతని స్థానంలో విజయ్ శంకర్ ఆడే అవకాశం ఉంటుంది. మరోవైపు మొహమ్మద్ నబీ స్థానంలో విలియమ్సన్‌ ఆడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.

హోల్డర్‌ ఆగయా

హోల్డర్‌ ఆగయా

ఐపీఎల్ 2020 కోసం వెస్టిండీస్‌ టెస్టు కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ తాజాగా యూఏఈలో అడుగుపెట్టాడు. కరోనా వైరస్ నేపథ్యంలో హోల్డర్‌ ఆరు రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం అతడు సన్‌రైజర్స్ హోటల్‌ రూమ్‌లోనే ఉన్నాడు. ఆరు రోజుల్లో మూడు సార్లు నిర్వహించే వైరస్ పరీక్షల్లో.. మూడు సార్లు నెగెటివ్‌గా వస్తేనే హోల్డర్‌ సన్‌రైజర్స్‌ జట్టుతో కలవనున్నాడు. ఇది జట్టుకు కాస్త ఊరానిచ్చే అంశం. ఎందుకంటే.. హోల్డర్‌ బ్యాట్, బంతితో మెరవగలడు.

'సంజూ శాంసన్‌ అద్భుతమైన ఆటగాడు.. అతడు జట్టులో లేకపోవడమా?'

Story first published: Sunday, September 27, 2020, 18:01 [IST]
Other articles published on Sep 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+