Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ‌పై వేటు.. అంజుమ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు!

మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దశాబ్దాల కలను సాకారం చేసుకుంది. తొలి వన్డే ప్రపంచకప్ అందించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ఈ విజయాన్ని యావత్ దేశం సెలెబ్రేట్ చేసుకుంటుంది. ఈ క్రమంలో భారత మహిళల మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వన్డే ప్రపంచకప్ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతలు వదిలేసి బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టాలని సూచించింది.

అయితే ఈ వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా ఘాటుగా స్పందించింది. శాంతా రంగస్వామి సలహాను తప్పుబట్టింది. ఓడినా.. గెలిచినా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం సరికాదని అభిప్రాయపడింది. 'ప్రతీ ప్రపంచకప్ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. గత నాలుగు, ఐదు ప్రపంచకప్‌ టోర్నీలుగా ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నోసార్లు చేసింది. భారత జట్టు సిరీస్ ఓడిపోయినా.. హర్మన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని అంటారు. తాజాగా భారత ప్రపంచకప్ గెలిచిన తర్వాత కూడా అవే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విజయ క్షణాలను నేను చెడగొట్టాలనుకోవడం లేదు. కాబట్టి ఆ వ్యాఖ్యల గురించి నేను మరింత మాట్లాడుకోవాలనుకోవడం లేదు.

Anjum Chopra Hits Back at Critics Questioning Harmanpreet Kaur s Leadership Post World Cup Victory

హర్మన్‌ప్రీత్ కౌర్‌తో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. స్థానిక మ్యాచ్‌లు ఆడే సమయంలోనే నేను ఆమె ప్రతిభను గుర్తించాను. 2007 08లో ముంబైలో జరిగిన ఛాలెంజర్స్ ట్రోఫీలో హర్మన్ అండర్ 19 ప్లేయర్‌గా ఉన్నప్పుడే.. హిట్టింగ్ సామర్థ్యం ఉందని గ్రహించాను. ఆమె టాప్ బ్యాటర్‌గా నిలుస్తుందని తెలుసుకున్నాను. ఆమె ఓ మ్యాచ్ విన్నర్ అనే విషయం ఆ రోజే నాకు అర్థమైంది. ఈ క్రమంలోనే హర్మన్‌ను కెప్టెన్ చేయాలని నేను పదే పదే డిమాండ్ చేసేదాన్ని.'అని అంజూమ్ చోప్రా చెప్పుకొచ్చింది.

Story first published: Monday, November 10, 2025, 16:29 [IST]
Other articles published on Nov 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+