Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కావ్య మారన్‌తో పెళ్లి.. అనిరుధ్ రియాక్షన్ ఇదే!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యమారన్, సౌతిండియా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతేడాదిగా ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. గతేడాది లాస్ వేగస్‌లో ఈ ఇద్దరూ కలిసి తరుగుతూ కనిపించారని పలువురు నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు కూడా తెలిసిందని, త్వరలోనే వివాహ బంధంతో ఈ జోడీ ఒక్కటవ్వనుందని ప్రచారం జరుగుతోంది. అయితే అనిరుధ్‌తో కావ్య మారన్ పెళ్లి అంటూ వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేక సార్లు ఈ వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ మధ్య ఈ పుకార్లు చాలా ఎక్కువయ్యాయి.

కావ్యమారన్ టీమ్ ఆగ్రహం..

ఈ వార్తలపై కావ్యమారన్ టీమ్ అధికారికంగా స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అనిరుధ్, కావ్య మారన్ మంచి స్నేహితులు మాత్రమేనని, పెళ్లి వార్తల్లో ఎటువంటి నిజం లేదని పేర్కొంది. తమ పరువుకు భంగం కలిగేలా వార్తలు రాయవద్దని విజ్ఞప్తి చేసింది. కొన్ని మీడియా సంస్థలకు కావ్య మారన్ టీమ్ నోటీసులు కూడా పంపించింది. పెళ్లి గురించి అసత్య వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. మరోవైపు అనిరుధ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ పుకార్లపై స్పందించాడు. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయవద్దని రిక్వెస్ట్ చేశాడు.

Anirudh Ravichander Denies Wedding Rumors with Kavya Maran

బిలియన్ డాలర్ల సంపదకు ఏకైక వారుసరాలు..

సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్ తనయే కావ్యమారన్. బిలియన్ డాలర్ల సంపదకు ఏకైక వారసురాలు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్‌గా ఐపీఎల్ మ్యాచ్‌లకు హాజరవుతూ.. తన హవాభావాలతో పాపులారిటీని సొంతం చేసుకుంది. జట్టు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆమె కొట్టే కేరింతలు.. ఓడినప్పుడు బుంగ మూతి పెడుతూ ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆమె హవాభావాలన్నీ మీమ్స్‌గా నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె కోసమే మ్యాచ్‌కు వచ్చేవాళ్లు కూడా ఉన్నారు.

రోజుకో పుకారు..

కావ్య మారన్ వ్యక్తిగత జీవితం గురించి రోజుకో పుకారు షికార్ చేస్తుంది. 2015లో టీవీఎస్ సంస్థ యాజమాని కుటుంబానికి చెందిన వ్యక్తితో కావ్య పెళ్లి అనే వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆ వార్తలు ఫేక్ అని తేలింది. తెలుగు హీరో అక్కినేని అకిల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మలతో కావ్య మారన్ డేటింగ్ చేస్తున్నట్లు కూడా పుకార్లు వచ్చాయి. కానీ అవి కూడా ఫేక్ అని స్పష్టమైంది. తాజాగా అనిరుధ్‌తో పెళ్లి అంటూ వచ్చిన వార్తల్లో కూడా నిజం లేదని స్పష్టమైంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే కావ్య మారన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. రిలేషన్‌లో ఉన్నట్లు కూడా అధికారికంగా ప్రకటించలేదు.

Story first published: Saturday, June 14, 2025, 21:55 [IST]
Other articles published on Jun 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+