'కుంబ్లే సార్‌ను చూసి చాలా నేర్చుకోవాలి'


న్యూ ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించకపోయినా.. ఆయన చేసే ట్వీట్లకు విలువ ఎక్కువ. ట్వీట్లలో వైవిధ్యం కనబరిచి అందిరి చూపు తనవైపు తిప్పుకొంటారు. తాజాగా ఓ అభిమాని చేసిన ట్వీట్‌కు ఆయన రిప్లై ఇచ్చిన విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బెంగళూరు నుంచి ముంబై వెళ్లే విమానంలో కుంబ్లే ప్రయాణిస్తున్న సమయంలో ఆయన్ను ఓ అభిమాని కలిసింది. ఆమెను ఉద్దేశించి కుంబ్లే చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
అనిల్‌కుంబ్లేను చూడగానే షాక్‌కి గురయ్యా
‘బెంగళూరు-ముంబై విమానంలో లెజెండరీ అనిల్‌కుంబ్లేను చూడగానే నేను షాక్‌కి గురయ్యాను. అప్పుడు వెంటనే టీమిండియాకు ఆడేటప్పుడు వెస్టిండీస్ మ్యాచ్‌లో భాగంగా ఆయన దవడకు బ్యాండేజ్ వేసుకున్న దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకుని ఏడ్చాను'అంటూ ఓ అభిమాని ట్వీట్ చేసింది.
ఖలీల్ చేతికి ట్రోఫీ: ధోనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
చెప్పాలనుంది.. కాళ్లు వణుకుతున్నాయి
మరో ట్వీట్‌లో ‘వెంటనే ఆయనను కలిసి క్రికెట్ కెరీర్‌లో ఆయన అభిమానులకు అందించిన మధుర జ్ఞాపకాల గురించి చెప్పి థాంక్స్ చెప్పాలనుంది. కానీ నా కాళ్లు వణుకుతున్నాయి' అంటూ మరో ట్వీట్ చేసింది.
ప్లీజ్ ఫీల్ ఫ్రీ.. టేకాఫ్ తర్వాత ‘హాయ్’
ఈ ట్వీట్లకు కుంబ్లే స్పందిస్తూ..‘ప్లీజ్ ఫీల్ ఫ్రీ..విమానం టేకాఫ్ అయిన తర్వాత వచ్చి ‘హాయ్'చెప్పి వెళ్లండి'అంటూ ట్వీట్ చేశారు.
బోర్డింగ్ పాస్ మీద కుంబ్లే ఆటోగ్రాఫ్
అనంతరం ఆమె మరో ట్వీట్ చేస్తూ ‘నా బోర్డింగ్ పాస్ మీద కుంబ్లే ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. మరో సారి అవకాశం దొరికితే ఆయన నుంచి మరికొంత వినయం నేర్చుకోవాలనుకుంటున్నాను'అంటూ ఆటోగ్రాఫ్ ఫొటోను జత చేస్తూ మరో ట్వీట్ చేసింది. అయితే కుంబ్లే అభిమానిని ట్రీట్ చేసిన విధానంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అనిల్ కుంబ్లే నిజంగానే లెజెండ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications