Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా దరిద్రం సర్ఫరాజ్ ఖాన్‌కు అంటుకున్నట్లుంది: అనిల్ కుంబ్లే

టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన అరంగేట్ర టెస్ట్‌లోనే దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన భారత బ్యాటర్‌గా హార్దిక్ పాండ్యా సరసన నిలిచాడు. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే తన సత్తా ఏంటో చూపించాడు.

గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చోటు దక్కింది. కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్.. శ్రేయస్ అయ్యర్‌ను తప్పించడంతో అరంగేట్రం చేశాడు. ఫియర్‌లెస్ గేమ్‌తో 66 బంతుల్లో 62 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్.. దురదృష్టవశాత్తు జడేజా తప్పిదం కారణంగా రనౌటయ్యాడు.

 Anil Kumble says I passed on my bad luck on Sarfaraz Khan’s unfortunate run-out

ఇక దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే నుంచి సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్ర క్యాప్‌ను స్వీకరించాడు. అయితే కాకతాళీయమో ఏమో కానీ అనిల్ కుంబ్లే సైతం అరంగేట్ర మ్యాచ్‌లో రనౌట్‌గానే వెనుదిరిగాడు.

జియోసినిమా పోస్ట్ మ్యాచ్ షోలో ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్న అనిల్ కుంబ్లే.. అరంగేట్ర క్యాప్‌తో పాటు తన బ్యాడ్ లక్‌ను కూడా సర్ఫరాజ్‌కు ఇచ్చానని చమత్కరించాడు. 'జడేజాతో నెలకొల్పిన భాగస్వామ్యంలో సర్ఫరాజ్ ఖాన్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. దాంతో జడేజా కాస్త సందిగ్ధంలో పడిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు నిర్ణయం తీసుకునే విషయంలో గందరగోళ నెలకొంటుంది. బహుషా.. సర్ఫరాజ్ రనౌట్‌కు ఇది కారణం కావచ్చు.

అంతేకాకుండా నా బ్యాడ్ లక్‌ను కూడా అరంగేట్ర క్యాప్‌తో సర్ఫరాజ్‌కు ఇచ్చాననుకుంటా. నా అరంగేట్ర మ్యాచ్‌లోనూ నేను రనౌటయ్యాను. కాకపోతే సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులు చేశాడు.'అని అనుకుంబ్లే చెప్పుకొచ్చాడు.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. క్రీజులో జడేజా (212 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 110 బ్యాటింగ్) తో పాటు కుల్దీప్ యాదవ్(1 బ్యాటింగ్) ఉన్నాడు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్ దారుణంగా విఫలమవ్వగా.. రోహిత్ శర్మ శతకంతో రాణించాడు.

Story first published: Thursday, February 15, 2024, 22:10 [IST]
Other articles published on Feb 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+