Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వీడ్కోలు ఇంకాస్త బాగుండాల్సింది.. అయినా ఫర్వాలేదు: భారత దిగ్గజం

Anil Kumble says I know the end could have been better but then thats fine

బెంగళూరు: ఏడాది కాలం భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా తన పదవిని ఆస్వాదించానని టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అన్నారు. కోచ్ పదవి నుండి వైదొలగక తప్పని పరిస్థితులు ఏర్పడిన కారణంగానే తప్పుకున్నానన్నారు. పిల్లలు చిన్నవారు కావడంతో ముంబై ఇండియన్స్‌ మెంటార్‌ పదవి నుంచి తప్పుకున్నానని, ఈ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో పనిచేసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని అనిల్ కుంబ్లే వెల్లడించారు.

వీడ్కోలు బాగుండాల్సింది:

వీడ్కోలు బాగుండాల్సింది:

తాజాగా జింబాబ్వే మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత పొమి ఎంబగ్వాతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అనిల్ కుంబ్లే మాట్లాడారు. 'కోచ్‌ పదవికి ఎంపికైనందుకు ఎంతో సంతోషించా. చాలా గొప్పగా అనిపించింది. జట్టు సభ్యులతో గడిపిన ఆ ఏడాది కాలం అమూల్యం. అద్భుతంగా ఆడే క్రికెటర్లతో మరోసారి డ్రస్సింగ్‌ రూమ్‌ పంచుకోవడం ఆనందకరమైన అనుభూతి. ఆ ఏడాదిలో మేం చాలా బాగా ఆడాం. జట్టు కోసం నా వంతు కృషి చేసినందుకు సంతృప్తిగానే ఉంది. అక్కడి నుంచి వెళ్లిపోయినందుకూ సంతోషంగానే ఉన్నా. అయితే వీడ్కోలు ఇంకాస్త బాగుండాల్సింది, కానీ ఫర్వాలేదు' అని కుంబ్లే తెలిపారు.

ఆమెతో విషయం చెప్పా:

ఆమెతో విషయం చెప్పా:

'టీమిండియా కోచింగ్‌ పదవికి ప్రకటన చూశాక కుటుంబ సభ్యులను అడిగా. ముఖ్యంగా నా సతీమణి అభిప్రాయం అడగ్గా.. "మంచి అవకాశం మళ్లీ రాదు, అప్లై చేయండంది". అప్పుడు నేను ఆమెతో ఓ విషయం చెప్పా.. "ఆడుతున్నప్పటిలాగే కోచ్‌గానూ డ్రస్సింగ్‌రూమ్‌లో ఉండాల్సి వస్తుందని, ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని చెప్పా". పిల్లలు పెద్దవాళ్లవడంతో కుటుంబ బాధ్యతలు చూసుకుంటానని ఆమె చెప్పడంతో దరఖాస్తు చేశా. ఆ తర్వాత నాకు ఆ ఉద్యోగం వచ్చింది. అందరూ సంతోషించారు' అని జంబో చెప్పారు.

ఆత్రుతగా ఎదురుచూస్తున్నా:

ఆత్రుతగా ఎదురుచూస్తున్నా:

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్)‌లో అనిల్ కుంబ్లే మూడేళ్లు ముంబై ఇండియన్స్‌ కోచింగ్‌ బృందంలో పనిచేశారు. పిల్లలు చిన్నవారు కావడంతో కుటుంబంతో గడిపేందుకు విరామం తీసుకున్నారు. 'ఆర్‌సీబీ, ముంబైకి మార్గదర్శకుడిగా పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఎందుకంటే మొదటిసారి ముంబై ఇండియన్స్‌ ట్రోఫీ గెలిచినప్పుడు నేనా బృందంలో ఉన్నా. ఆ తర్వాత జట్టు వెనుదిరిగి చూసుకోలేదు. ఏడేళ్లలో నాలుగు సార్లు విజేతగా నిలిచింది. ప్రస్తుతం కింగ్స్‌ ఎలెవన్‌తో పనిచేసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. 12 ఏళ్లుగా ఆ జట్టు‌ నిలకడగా ఆడుతోంది' అని కుంబ్లే అన్నారు.

కోహ్లీతో విబేధాలు:

కోహ్లీతో విబేధాలు:

అనిల్‌ కుంబ్లే 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ముందు కోచ్‌ పదవి నుండి తప్పుకున్నారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అనిల్‌ కుంబ్లే మొదట్లో బాగానే ఉన్నా.. జంబో తరహా క్రమశిక్షణ విరాట్‌కు నచ్చలేదు. ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు రావడంతో.. కుంబ్లేనే హుందాగా తన పదవి నుంచి తప్పుకున్నారు. భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్‌, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌ వారిద్దరి మధ్య సయోధ్య కుదుర్చేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. దాంతో కోచ్‌ పదవికి బీసీసీఐ మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆపై రవిశాస్త్రి కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఒంటిచేత్తో ఒల్లీ పోప్‌ స్టన్నింగ్ క్యాచ్.. ఇంగ్లండ్ ఘన విజయం (వీడియో)

Story first published: Wednesday, July 22, 2020, 15:37 [IST]
Other articles published on Jul 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+