Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ చెత్త కెప్టెన్సీతో సిరాజ్ నోటీ దూల తీరింది: అనిల్ కుంబ్లే

ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా బౌలింగ్ ప్రదర్శనపై దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ సారథ్యంపై విమర్శలు గుప్పించాడు. మహమ్మద్ సిరాజ్ నోటీ దూల తీరిందని, మరోసారి బ్యాటర్లతో గొడవకు దిగడని పేర్కొన్నాడు.

బ్రిస్బేన్‌లోని ఐకానికి గబ్బా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌పై ఆసీస్ పట్టు బిగించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 101 ఓవర్లలో 7 వికెట్లకు 405 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(160 బంతుల్లో 18 ఫోర్లతో 152), స్టీవ్ స్మిత్ (190 బంతుల్లో 12 ఫోర్లతో 101) విధ్వంసకర శతకాలతో చెలరేగారు. స్మిత్-హెడ్ నాలుగో వికెట్‌కు 241 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడం గమనార్హం.

Anil Kumble says I don t understand what kind of captaincy Rohit Sharma is displaying

భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/72) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. మహమ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసారు. ట్రావిస్ హెడ్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. అడిలైడ్ వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో హెడ్ శతక్కొట్టి టీమిండియాను చిత్తు చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కనబర్చారు.

ట్రావిస్ హెడ్‌ను కట్టడి చేయకపోవడంపై అనిల్ కుంబ్లే అసహనం వ్యక్తం చేశాడు. అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ.. కెప్టెన్‌గా రోహిత్ ఏం చేస్తున్నాడని, టీమిండియాకు మొగుడిలా తయారైన ట్రావిస్ హెడ్‌కు చెక్ వ్యూహాలను సిద్దం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'రోహిత్ శర్మ చేస్తున్న కెప్టెన్సీ ఏంటో ఏమో నాకు అర్థం కావడం లేదు. ట్రావిస్ హెడ్ ఎప్పుడూ ఇండియాకు సవాల్‌గా నిలుస్తున్నాడు. అయినా ఇప్పటికే అతన్ని కట్టడి చేసే ప్రణాళికలు టీమిండియా దగ్గర లేకపోవడం సిగ్గు చేటు. ఈ కెప్టెన్సీ అత్యంత నిరాశకు గురి చేసింది.

కెప్టెన్‌గా సొంతగడ్డపై తేలిపోయిన రోహిత్.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ అదే ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఇర ఈ రోజు మహమ్మద్ సిరాజ్‌ను ట్రావిస్ హెడ్ ఆడిన తీరు అసాధారణం. డేంజరస్ బ్యాటర్లను గెలకవద్దనే పాఠాన్ని సిరాజ్ నేర్చుకొని ఉంటాడని భావిస్తున్నా. నేను సిరాజ్‌ను అయితే ఈ రోజు రిటైర్మెంట్ ప్రకటించేవాడిని.'అని అనిల్ కుంబ్లే విమర్శలు గుప్పించాడు.

Story first published: Sunday, December 15, 2024, 22:13 [IST]
Other articles published on Dec 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+