ఆజాజ్ పటేల్.. వెల్‌కమ్ టూ 10 వికెట్స్ క్లబ్: అనిల్ కుంబ్లే

ముంబై: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో 10 వికెట్ల ఘనతతో చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అద్భతమైన బౌలింగ్‌తో 10 వికెట్లు తీసిన ఆజాజ్.. క్రికెట్ చరిత్రలోనే ఈ ఫీట్ సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. 47.5 ఓవర్లు వేసిన ఆజాజ్ పటేల్ 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లు సాధించాడు. అంతకు ముందు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు. 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో జిమ్ లేకర్ ఒకే ఇన్నింగ్స్‌లో 53 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీసి ఈ ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత మరో 43 ఏళ్లకు అనిల్ కుంబ్లే 1999లో పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 74 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు.

వెల్‌కట్ టూ క్లబ్..
కుంబ్లే తర్వాత మళ్లీ 22 ఏళ్లకు ఆజాజ్ పటేల్ ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి వికెట్‌గా మహమ్మద్ సిరాజ్‌ను ఖాతాలో వేసుకొని ఆజాజ్ పటేల్ ఈ వరల్డ్ రికార్డు అందుకున్నాడు. ఇక ఆజాజ్ పటేల్ ఘనతపై అనిల్ కుంబ్లే ట్విటర్ వేదికగా స్పందించాడు. 10 వికెట్ల క్లబ్‌లోకి స్వాగతమంటూ ట్వీట్ చేశాడు. 'ఆజాజ్ చాలా బాగా బౌలింగ్ చేశావు. వెల్‌కమ్ టూ క్లబ్'' అని పేర్కొన్నాడు. ఇక ఆజాజ్ పటేల్ సూపర్భ్ ఫీట్‌పై స్పందిస్తూ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కోసం అనిల్ కుంబ్లే ఓ సెల్ఫీ వీడియోలో కూడా మాట్లాడాడు.

ఈ ఫీట్‌ను ఆస్వాదించూ..
ఆజాజ్ పటేల్ ఘనతను కొనియాడుతూ అభినందనలు తెలిపాడు. టెస్ట్ మ్యాచ్‌లో తొలి రెండు రోజుల్లోనే ఇలాంటి ఫీట్ సాధించడం ఎంతో గొప్ప విషయమని, 10 వికెట్ల ఘనత అనేది ప్రత్యేక అనుభూతని పేర్కొన్నాడు. ఇక నుంచి ఆజాజ్‌పై అంచనాలు పెరుగుతాయని, అభిమానులు చాలా ఆశిస్తారని, ప్రతీ మ్యాచ్‌లో 10 వికెట్లు తీయాలని కోరుకుంటారని చెప్పాడు. ఇవన్నీ పక్కనపెట్టి ఈ ఘనతను ఆస్వాదించాలని సూచించాడు. ఇక ఆజామ్ లెఫ్టార్మ్ బౌలింగ్ అద్భుతంగా ఉందని కొనియాడాడు.

భారత్ 325 ఆలౌట్..
221/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ ఆజాజ్ పటేల్ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్(311 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 150) భారీ శతకంతో చెలరేగగా.. చివర్లో అక్షర్ పటేల్(128 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. శుభ్‌మన్ గిల్(44), వృద్దిమాన్ సాహా(27) పర్వాలేదనిపించగా.. విరాట్ కోహ్లీ(0), చతేశ్వర్ పుజారా(0), రవిచంద్రన్ అశ్విన్(0) దారుణంగా విఫలమయ్యారు.న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ మినహా మరే బౌలర్ ప్రభావం చూపలేకపకోయాడు.

న్యూజిలాండ్ 62 ఆలౌట్..
అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ భారత బౌలర్ల ధాటిక 62 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ సిరాజ్(3/19), రవిచంద్రన్ అశ్విన్(4/8), అక్షర్ పటేల్(2/14) వికెట్లతో విరుచుకుపడటంతో కివీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కైల్ జెమీసన్(17), టామ్ లాథమ్(10) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్, అశ్విన్, అక్షర్‌కు తోడుగా జయంత్ యాదవ్ ఓ వికెట్ తీశాడు. దాంతో భారత్ 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం ఫాలో ఆన్ ఆడించకుండా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వికెట్ నష్టపోకుండా 50 పరుగులు పూర్తి చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications