For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంపైర్‌పై కోపంతో హెల్మెట్, బ్యాట్ నేలకు కొట్టిన మాథ్యూవెడ్‌ .. వార్నింగ్‌తో వదిలేసిన రిఫరీ! (వీడియో)

Angry Matthew Wade throws helmet, smashes bat in dressing room after controversial dismissal

ముంబై: గుజరాత్ టైటాన్స్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌ క్రమ శిక్షణ తప్పి మ్యాచ్ రిఫరీ మందలింపునకు గురయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో మాథ్యూవేడ్ నిబంధనలు ఉల్లంఘించాడు. ఔటైన అసహనంలో డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చచేశాడు. తన బ్యాట్, హెల్మెట్‌ను నేలకు కొడుతూ ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. మాథ్యూవేడ్ భీభత్సానికి సంబంధించిన దృశ్యాలు లైవ్‌లో స్టేడియంలోని పెద్ద స్క్రీన్‌లపై ప్రత్యక్షమయ్యాయి. దాంతో.. ఐపీఎల్ క్రమశిక్షణ నియమావళిని ఉల్లఘించిన మాథ్యూవెడ్‌ను మొదటి తప్పిదంగా భావించి మ్యాచ్ రిఫరీ మందలించాడు. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనను విడుదల చేశారు.

16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గ్లేన్ మాక్స్‌వెల్ బౌలింగ్‌లో మాథ్యూవెడ్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. కానీ.. బంతి బ్యాట్‌కి తాకిందని ఆరోపించిన మాథ్యూవెడ్.. ఫీల్డ్ అంపైర్ ఔటివ్వగానే డీఆర్‌ఎస్ కోరాడు. కానీ.. థర్డ్ అంపైర్ మాత్రం ఆల్ట్రా ఎడ్జ్‌లో సరిగా పరిశీలించకుండా.. బాల్ ట్రాకింగ్ ఆధారంగా ఔట్ అని ప్రకటించాడు. దాంతో.. తిట్టుకుంటూ పెవిలియన్‌కి వెళ్లిన మాథ్యూవెడ్.. డ్రెస్సింగ్ రూములో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అంపైర్‌పై ఉన్న కోపాన్ని తన బ్యాట్, హెల్మెట్‌పై చూపించాడు.

ఈ మ్యాచ్‌లో 8 వికెట్లతో విజయాన్నందుకున్న ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (47 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 నాటౌట్‌), మిల్లర్‌ (25 బంతుల్లో 3 సిక్సర్లతో 34) రాణించారు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 170 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి తోడుగా... డుప్లెసిస్‌ (38 బంతుల్లో5 ఫోర్లతో 44) రాణించాడు. బౌలింగ్‌లో కీలకమైన వికెట్, అద్భుతమైన క్యాచ్‌ పట్టిన మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్‌) మెరుపు బ్యాటింగ్‌తో జట్టు విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Friday, May 20, 2022, 16:00 [IST]
Other articles published on May 20, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+