Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షాకింగ్ న్యూస్.. కారు ప్రమాదంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ దుర్మరణం!

Andrew Symonds dies aged 46 in car accident

న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సైమండ్స్ దుర్మరణం చెందాడు. సైమండ్స్ మృతితో క్రికెట్ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇటీవలె దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అకాల మృతి చెందగా... ఇప్పుడు సైమండ్స్ మరణించడం క్రికెట్ అభిమానులను శోకసంద్రంలో ముంచింది. సైమండ్స్ మృతి పట్ల ప్రముఖులు, మాజీ క్రికెటర్లు, క్రీడాభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

కారులో సైమండ్స్ ఒక్కడే..

కారులో సైమండ్స్ ఒక్కడే..

క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రాత్రి 10:30 గంటలకు నగరానికి పశ్చిమాన 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెర్వీ రేంజ్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. వేగంగా వెళ్తున్న కారు రోడ్డుపై బోల్తా కొట్టినట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. ప్ర‌మాద స‌మ‌యంలో ఆండ్రూ సైమండ్స్ మాత్ర‌మే కారులో ఉన్నట్టు తెలుస్తోంది.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆండ్రూ సైమండ్స్‌ను రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా విఫలమయ్యారు. ఈ ప్రమాదంలో సైమండ్స్‌కు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.

14 ఏళ్ల కెరీర్..

14 ఏళ్ల కెరీర్..

1998లో పాకిస్థాన్‌పై వన్డేల్లో అరంగేట్రం చేసిన సైమండ్స్.. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఆసీస్ తరఫున మొత్తం 198 వన్డేల్లో 5088 రన్స్ చేయగా.. ఇందులో 6 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 37.26 యావరేజ్‌తో 133 వికెట్లు తీసుకున్నాడు. బెస్ట్ బౌలింగ్ 18 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా గెలిచిన మూడు ప్రపంచకప్‌ (1999, 2003, 2007)టోర్నీల్లో అతను కీలక సభ్యుడుగా ఉన్నాడు.

టెస్ట్‌ల్లో..

టెస్ట్‌ల్లో..

2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ఆరంభించిన ఈ దిగ్గజ ఆటగాడు.. 26 మ్యాచ్‌ల్లో 1463 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 37.33 యావరేజ్‌తో 24 వికెట్లు పడగొట్టాడు. కెరీర్‌లో 14 టీ20 మ్యాచ్‌లు ఆడి.. రెండు హాఫ్ సెంచరీల సాయంతో 337 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 8 వికెట్లు కూడా తీశాడు.

ఐపీఎల్‌లో హైదరాబాద్ తరఫున..

ఐపీఎల్‌లో హైదరాబాద్ తరఫున..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్ జట్లకు సైమండ్స్ ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్‌లో సైమండ్స్‌ను డెక్కన్ ఛార్జర్స్ రూ.5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం. మూడు సీజన్ల పాటు ఆజట్టుకు ఆడిన సైమండ్స్ 2009 సీజన్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఆ తర్వాత అతన్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రెండు జట్ల తరఫున సైమండ్స్ 974 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 అర్థ సెంచరీలున్నాయి. అయితే ఐపీఎల్ వేలంలో తనకు భారీ ధర పలకడంతోనే క్లార్క్‌తో తన స్నేహం చెడిందని ఇటీవల సైమండ్స్ పేర్కొన్నవిషయం తెలిసిందే.

Story first published: Sunday, May 15, 2022, 7:21 [IST]
Other articles published on May 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+