Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రైట్ హ్యాండర్‌కు ఆఫ్ స్పిన్ అంటే లడ్డూ తిన్నట్లే: రస్సెల్

Andre Russell says right hander facing an off-spinner ‘It’s like kid in candy shop’

ముంబై: కుడిచేతి బ్యాటర్లకు ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేయించడం పిల్లాడిని మిఠాయిల ముందు నిల్చోబెట్టినట్లేనని కోల్‌కతా విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్ అన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ విండీస్ వీరుడు ఆల్‌రౌండ్ షో కనబర్చిన విషయం తెలిసిందే. దాంతో కేకేఆర్ 55 పరుగుల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌లో 49 పరుగులతో అజేయంగా నిలిచిన రస్సెల్.. ఆ తర్వాత బౌలింగ్ మూడు కీలక వికెట్లు తీసాడు. మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసిన రస్సెల్... ఎన్ని కష్టాలు ఎదురైన గేమ్ చివరి వరకు క్రీజులో నిలబడాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.

'నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు బౌలర్లు వికెట్‌పైకి బౌలింగ్ చేస్తే కాస్త కష్టంగా ఉంటుంది. అయితే నేను ముందే ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా క్రీజులో నిలబడాలని మానసికంగా ప్రిపేరయ్యాను. తొలి బంతి నుంచే హిట్ చేయాలనుకున్నా. నెట్స్‌లో సాధన కూడా చేశాను. ఇక బౌలింగ్‌లో సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టాను. మొత్తానికి ఈ రోజు నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా'అని రస్సెల్ చెప్పాడు.

ఇక కుడిచేతి బ్యాటర్లకు ఆఫ్ స్పిన్ బౌలింగ్ అంటే పండుగేనని రస్సెల్ తెలిపాడు. పిల్లాడిని మిఠాయి షాపులో ఉంచినట్లేనని చెప్పాడు. ఆఖరి ఓవర్ సుందర్ వేస్తాడని ముందే గ్రహించి సునీల్ నరైన్‌కు స్ట్రైకింగ్ ఇవ్వమని చెప్పానన్నాడు. '19వ ఓవర్ చివరి బంతికి ముందే సునీల్.. బౌండరీ కొట్టడానికి ప్రయత్నించు. నేను స్పిన్ బౌలింగ్‌ను ఆడుతా. ఆఫ్ స్పిన్ బౌలింగ్ కుడిచేతి బ్యాటర్‌కు పండుగే. నాకు ఫుల్ టాస్‌లు కూడా లభించాయి. దాంతో భారీ సిక్సర్లు బాదా. బ్యాట్‌, బంతితో రాణించడం సంతోషంగా ఉంది. ఈ రోజు ప్రదర్శన చూసిన తర్వాత ప్లే ఆఫ్స్ చేరుతామనే నమ్మకం ఏర్పడింది'అని రస్సెల్ చెప్పుకొచ్చాడు.

సుందర్ వేసిన ఆఖరి ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాదిన రస్సెల్ 20 పరుగులతో భారీ స్కోర్ అందించాడు. దాంతో మూమెంట్ కోల్పోయిన సన్‌రైజర్స్ చివరకు ఓటమిపాలైంది. కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ చేసిన తప్పిదంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేస్ బౌలర్లను ముందే ఉపయోగించడం జట్టుకు నష్టం చేసింది.

Story first published: Sunday, May 15, 2022, 14:36 [IST]
Other articles published on May 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+