7 బంతుల్లో 40 పరుగులు..
సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రస్సెల్ వరుసగా 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు. అయితే ఈ ఫీట్‌ను రస్సెల్ రెండు ఓవర్లలో పూర్తి చేశాడు. పేట్రియాట్స్ బౌలర్ డ్రేక్స్ వేసిన 7వ ఓవర్ చివరి నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు బాదిన రస్సెల్.. ఆ మరుసటి ఓవర్ తొలి రెండు బంతులకు మరో రెండు సిక్సర్లు బాదాడు. అంతేకాకుండా ఆ తర్వాతి బంతిని ఫోర్ కొట్టాడు. అంటే రస్సెల్ వరుసగా 6, 6, 6, 6, 6, 6, 4తో కేవలం 7 బంతుల్లో 40 పరుగులు పిండికున్నాడు.
కొత్తరూల్స్ సహకారంతో..
అయితే ఓవర్ పూర్తయ్యాక బ్యాటింగ్ ఎండ్స్ మారుతాయి కదా? సందేహం రావచ్చు. కానీ సిక్స్ టీ టోర్నీలో కొత్త నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ నిబంధనల ప్రకారం ఓవర్ ఓవర్ కు బ్యాటింగ్, బౌలింగ్ ఎండ్స్ మారవు. ఒక ఎండ్ నుంచి వరుసగా 5 ఓవర్ల పాటు బౌలింగ్ చేస్తారు. అనంతరం మరో ఎండ్ నుంచి మిగిలిన ఓవర్లను బౌలింగ్ చేస్తారు. దాంతో రస్సెల్ ఓవర్ మారినా స్ట్రైకింగ్‌లోనే ఉన్నాడు. ఈ కొత్త రూల్స్ కూడా అతనికి ఈ ఫీట్ సాధించడంలో సహకరించాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రస్సెల్ టీమ్ విజయం..
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్ బాగో నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. రస్సెల్ (24 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 72) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం పేట్రియాట్స్ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేసి 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ జట్టులో రూథర్ ఫోర్డ్ (15 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లతో 50), డొమినిక్ డ్రేక్స్ (10 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 33 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది.


Click it and Unblock the Notifications
