
రసెల్ విధ్వంసం
వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. గాలే గ్లాడియేటర్స్ టీమ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. కొలంబో కింగ్స్ మొదటగా బ్యాటింగ్ చేసింది. హార్డ్‌హిట్టర్ ఆండ్రూ రసెల్, టీ డిసిల్వాలు ఇన్నింగ్స్ ఆరంభించారు. అమిర్ వేసిన తొలి ఓవర్లోనే రసెల్ మూడు ఫోర్లు, రెండు సిక్సులు బాది 26 రన్స్ బాదాడు. అసితా ఫెర్నాండో వేసిన రెండో ఓవర్లో కూడా రసెల్ చెలరేగాడు. ఓ సిక్స్, హ్యాట్రిక్ బౌండరీలతో మరో 26 పరుగులు పిండుకున్నాడు. మూడో ఓవర్లో 11 పరుగులే ఇచ్చి మొహమ్మద్ షిరాజ్ కాస్త కట్టడి చేశాడు.

14 బంతుల్లో రసెల్ ఫిఫ్టీ
ఆఫ్రిది వేసిన నాలుగో ఓవర్ నాలుగో బంతికి ఫోర్ బాదిన ఆండ్రూ రసెల్.. 14 బంతుల్లో 53 రన్స్ చేశాడు. ఇది టీ20 క్రికెట్లో ఐదవ వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఇదే ఓవర్లో లారీ ఎవాన్స్ కూడా రెండు సిక్సులు బాదడంతో 20 రన్స్ వచ్చాయి. ఇక ఆఫ్రిది చివరి ఓవర్లో 13 పరుగులు ఇచ్చాడు. రసెల్ రెండు సిక్సులు కొట్టాడు. మొత్తంగా 19 బంతులు ఎదుర్కొన్న రసెల్ 9 ఫోర్లు, 4 సిక్సర్లతో విరుచుకుపడి అజేయంగా 65 పరుగులు చేశాడు. ఎవాన్స్ 10 బంతుల్లో 21 రన్స్ చేయడంతో కొలంబో కింగ్స్ 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 96 రన్స్ చేసింది. అమిర్ రెండు ఓవర్లలో 46 రన్స్ ఇచ్చాడు.

గుణతిలక చెలరేగినా
భారీ లక్ష్య చేధనకు దిగిన గాలే గ్లాడియేటర్స్ కూడా ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. దనుష్క గుణతిలక, హజ్రతుల్లా జజాయ్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు రెండు ఓవర్లలో 35 రన్స్ చేశారు. అయితే మూడో ఓవర్లో ధాటిగా ఆడే క్రమంలో జజాయ్ (6) పెవిలియన్ చేరాడు. అషన్ ప్రియాంజన్ కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. నాలుగో ఓవర్లో షాహిద్ ఆఫ్రిది మూడు బౌండరీలతో 14 రన్స్ రాబట్టాడు. ముందు కొండంత లక్ష్యం ఉండడంతో భారీ షాట్ ఆడే క్రమంలో ఆఫ్రిది ఔట్ అయ్యాడు. చివరలో అజాం ఖాన్ ఫోర్, సిక్స్ బాదినా గ్లాడియేటర్స్ జట్టుకు ఓటమి తప్పలేదు. ప్రియాంజన్, అహ్మద్ తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. కోహ్లీకి 250వ వన్డే మ్యాచ్!!


Click it and Unblock the Notifications












