Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలా ఆడలేకనే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికా: ఆండ్రీ రస్సెల్

ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడలేకనే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించానని వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రస్సెల్ తెలిపాడు. సుదీర్ఘకాలం కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)కు ఆడిన రస్సెల్.. మినీ వేలానికి ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రస్సెల్ తన రిటైర్మెంట్‌కు గల కారణాన్ని వెల్లడించాడు.

'ఐపీఎల్ చాలా పెద్ద టోర్నీ. మ్యాచ్‌ల సంఖ్య ఎక్కువ. ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్, జిమ్, వర్క్‌లోడ్‌ను సమతూకంగా చేసుకోవడం చాలా కష్టం. ఆల్‌రౌండర్‌గా నాకు మరింత సవాల్. నేను కేవలం బ్యాటింగ్ చేస్తేనే సరిపోదు. ఒక మ్యాచ్‌లో కనీసం రెండు ఓవర్ల‌పాటు బౌలింగ్ చేయాలి. నేను చక్కగా బౌలింగ్ చేయగలిగాను అనుకున్నప్పుడే.. బ్యాటింగ్‌లో రాణిస్తాను.

Andre Russell Finally Breaks Silence on His Surprise IPL Retirement ahead of Mini Auction

నేను కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చి, సిక్స్‌లు కొడితే సరిపోతుందనుకోను. బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేసినప్పుడే నేను ఆటను ఆస్వాదించగలను.'అని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆండ్రీ రస్సెల్.. కోచ్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. కేకేఆర్ యాజమాన్యం రస్సెల్‌ను పవర్ కోచ్‌గా నియమించుకుంది.

ఇక రిటైర్మెంట్ ఎందుకు అన్ని ప్రశ్నించే సమయంలోనే ఆట నుంచి తప్పుకోవడం ఉత్తమమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని రస్సెల్ తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు. 'హాయ్ కేకేఆర్ ఫ్యాన్స్.. నేను మీ రస్సెల్. ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నా. కేకేఆర్ నాకు ఎన్నో అవకాశాలను, అద్భుతమైన జ్ఞాపకాలను అందించింది. భారీ సిక్స్‌లు కొట్టడం, మ్యాచ్‌లు గెలవడంతో ఒక గొప్ప ఆటగాడిలా నన్ను మీ ముందుంచాయి.

ఈ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నప్పుడు ఇది నా కెరీర్‌లో బెస్ట్ నిర్ణయం అవుతుందని అనిపించింది. నేను ఐపీఎల్‌లో ఫేడౌట్ అవ్వాలని అనుకోవడం లేదు. ఓ లెగసీని అందించి వెళ్లాలని అనుకున్నాను.'అని రస్సెల్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో 140 మ్యాచ్‌లు ఆడి 174.18 స్ట్రైక్‌రేట్‌తో 2651 పరుగులు చేశాడు. ఇందులో 12 హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్‌లో 9.51 ఎకానమీతో 123 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శన కూడా చేశాడు.

Story first published: Friday, December 5, 2025, 14:43 [IST]
Other articles published on Dec 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+