
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో తమ మ్యాచ్‌కు ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రూ రస్సెల్ తన భీకరమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో బుధవారం జరగనున్న మ్యాచ్‌తో కేకేఆర్ తమ ఐపీఎల్ 2020 జర్నీ ప్రారంభించనుంది. ఈ మ్యాచ్‌లో సత్తాచాటేందుకు రస్సెల్ చమటోడ్చుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన సూపర్ బ్యాటింగ్ స్కిల్స్‌తో కెమెరాను పగలగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను కేకేఆర్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
'లాస్ట్ షాట్ వరకు వేచి ఉండండి.. కండబలం గల రస్సెల్ చెలరేగేందుకు సిద్దమవుతున్నాడు'అనే క్యాప్షన్‌ను పేర్కొంది. ఇక గత సీజన్‌లో రస్సెల్ రఫ్ఫాడించిన విషయం తెలిసిందే. తన ధాటైన బ్యాటింగ్‌తో ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. ఈ సారి అదే ఫామ్ రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. గత సీజన్‌లో నిరాశపర్చిన కేకేఆర్.. ఈ సారిటైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. దినేశ్ కార్తీక్ నేతృత్వంలో జట్టు సమతూకంగా ఉంది. పైగా 2014లో యూఏఈ వేదికగా సగం మ్యాచ్‌లు జరగ్గా.. ఆ సీజన్‌లో కేకేఆర్ చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భావిస్తోంది.
2008లో ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో ఐపీఎల్‌ను ఎక్కడికో తీసుకెళ్లిన బ్రెండన్ మెకల్లమ్ కేకేఆర్ హెడ్ కోచ్‌గా తన పనితనాన్ని చూపెట్టబోతున్నాడు. ఇప్పటికే కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో కేకేఆర్ ఫ్రాంచైజీకే చెందిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన మెకల్లమ్.. ఐపీఎల్ టైటిల్ కూడా అందించాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, టామ్ బాంటన్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి.. ఇలా ఎనిమిదో స్థానం వరకు ఆడే బ్యాటింగ్ డెప్త్ ఉంది. బౌలింగ్‌లో సునీల్ నరైన్, కుల్దీప్ స్పిన్ మ్యాజిక్ చేయగలరు. ప్యాట్ కమిన్స్, లూకీ ఫెర్గుసన్, శివమ్ మావి, ప్రసిద్ కృష్ణతో పేస్ విభాగం బలంగానే ఉంది.