
ముందు జాగ్రత్తగా..
'సాహాకు కవర్‌గా భరత్‌ను తీసుకున్నారు. ఒకవేళ నిర్ణీత టైమ్‌లో సాహా ఫిట్‌నెస్ సాధించకుంటే మూడు నెలల లాంగ్‌టూర్‌లో మనకు సెకండ్ కీపర్ అవసరం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా భరత్‌ను ఎంచుకున్నారు.'అని బోర్డు వర్గాలు తెలిపాయి. ఆంధ్ర తరఫున డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు భారత్-ఎ టీమ్‌లో నిలకడగా రాణిస్తున్న భరత్ రెండేళ్ల నుంచి టీమిండియాకు బ్యాకప్ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఆస్ట్రేలియా టూర్‌కు కూడా వెళ్లాడు. రీసెంట్‌గా ఇంగ్లండ్‌తో హోమ్ సిరీస్‌లో కూడా టీమ్‌తోనే ఉన్నాడు.

క్వారంటైన్ షురూ..
జూన్ 2న ఇంగ్లండ్ ఫ్లయిట్ ఎక్కడానికి రెండు వారాల ముందునుంచే ముంబైలోని ఒక హోటల్‌లో జట్టు సభ్యులంతా హార్డ్ క్వారంటైన్‌లో గడపనున్నారు. కరోనా నేపథ్యంలో బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం వీరంతా తమ హోటల్ గదులు దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడానికి వీల్లేదు. కరోనా కారణంగానే ఐపీఎల్‌ను వాయిదా వేయాల్సి రావడంతో ఈ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు బోర్డు సన్నద్ధమైంది. ఆటగాళ్ల క్వారంటైన్ బుధవారం నుంచే ప్రారంభమైంది. ముంబైలో క్వారంటైన్‌లోకి అడుగు పెట్టే ముందు క్రికెటర్లు కనీసం మూడుసార్లు కరోనా నెగెటివ్‌గా తేలిన రిపోర్టులతో రావాలి. క్వారంటైన్ సమయంలో కూడా కనీసం మరో మూడుసార్లు ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మరోవైపు పురుషుల జట్టుతో పాటే ఇంగ్లండ్ వెళ్లనున్న భారత మహిళల జట్టుకు కూడా క్వారంటైన్ విషయంలో ఇవే ప్రొటోకాల్ వర్తింపజేస్తున్నారు. ఈ పర్యటనలో మహిళల టీమ్ ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టి20ల్లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది.

సాహాకు సడలింపు...
ముంబై, సమీప ప్రాంతాల్లో ఉంటున్న క్రికెటర్లకు మాత్రం బీసీసీఐ కాస్త సడలింపు ఇచ్చింది. వారంతా క్వారంటైన్‌లో చేరేందుకు మే 24 వరకు అవకాశం ఇచ్చింది. ఇందులో కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు అజింక్య రహానే, రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్, కోచ్ రవిశాస్త్రి ఉన్నారు. అపెండిసైటిస్‌కు చికిత్స అనంతరం రాహుల్ కూడా ముంబైలోనే ఉంటున్నాడు. అయితే వీరు కూడా బుధవారం నుంచే తమ ఇళ్ల వద్ద హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. ఐపీఎల్ సమయంలో కరోనా బారిన పడి కోలుకున్న పేసర్ ప్రసిధ్ కృష్ణ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాలకు కూడా బోర్డు మరి కొంత సమయం ఇచ్చింది. వీరిద్దరు కూడా కాస్త ఆలస్యంగా ముంబైలో జట్టుతో కలుస్తారు.

ఫ్యామిలీస్ అనుమతిపై నో క్లారిటీ..
లండన్ చేరిన తర్వాత భారత జట్టు నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక అయిన సౌతాంప్టన్‌కు వెళ్లిపోతుంది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే బయో బబుల్ నిబంధనల ప్రకారం భారత క్రికెటర్లు తమ సహచరులతో కలిసి ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. హోటల్, గ్రౌండ్, ప్రాక్టీస్ నెట్స్ పరిధి దాటకుండా ఈ 10 రోజులు ఆటగాళ్లు గడపాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్‌లో అమ ల్లో ఉన్న ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో ఈ సిరీస్ సందర్భంగా క్రికెటర్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి ముంబై క్వారంటైన్ వరకైతే భార్యా, పిల్లలను అనుమతించింది.


Click it and Unblock the Notifications












