తెలుగు జట్లకు ఓటమి!
ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆంధ్ర, హైదరాబాద్ జట్లు శుభారంభాన్ని అందుకోలేకపోయాయి. ఢిల్లీ చేతిలో ఆంధ్ర, ఉత్తరప్రదేశ్ చేతిలో హైదరాబాద్ ఓటమిపాలయ్యాయి. బెంగళూరులోని బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 4 వికెట్ల తేడాతో ఢిల్లీ చేతిలో ఓటమిపాలైంది.
విరాట్ విధ్వంసం.. ఆంధ్రకు పరాజయం
విరాట్ కోహ్లీ( 101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131) విధ్వంసకర శతకంతో ఆంధ్ర ఓటమిని శాసించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 298 పరుగులు చేసింది. ఆంధ్ర బ్యాటర్లలో రికీ భుయ్(105 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 122) సెంచరీతో రాణించగా.. నితీష్ రెడ్డి(23)తీవ్రంగా నిరాశపర్చాడు.
అనంతరం ఢిల్లీ 37.4 ఓవర్లలో 6 వికెట్లకు 300 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131) సెంచరీతో చెలరేగగా.. ప్రియాన్ష్ ఆర్య(74), నితీష్ రాణా(77) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆంధ్ర బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి ఒక వికెట్ తీయగా.. సత్యనారయణ రాజు, మారమ్‌రెడ్డి హేమంత్ రెడ్డి రెండేసి వికెట్లు తీసారు. నర్సింహ్మా రాజు ఒక వికెట్ పడగొట్టాడు.
హైదరాబాద్‌కు ఘోర పరాజయం
యూపీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 84 పరుగుల తేడాతో చిత్తయ్యింది. యూపీ బౌలర్ జీషన్ అన్సారీ (4/31) నాలుగు వికెట్లతో హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 324 పరుగులు చేసింది. కెప్టెన్ రింకూ సింగ్(67)తో పాటు ధ్రువ్ జురెల్(80), ఆర్యన్ జుయల్(80), అభిషేక్ గోస్వామి(81) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం హైదరాబాద్ 240 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తన్మయ్ అగర్వాల్(53) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రాహుల్ సింగ్(47), వరుణ్ గౌడ్(45) హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు.

కీలక మ్యాచ్‌ల ఫలితాలు..
1. ముంబై vs సిక్కిం
రోహిత్ శర్మ (155) అద్భుత సెంచరీతో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన ముంబై
2. ఢిల్లీ vs ఆంధ్ర
విరాట్ కోహ్లీ (131) శతకంతో 4 వికెట్ల తేడాతో గెలుపొందిన ఢిల్లీ. ఆంధ్ర తరఫున రికీ భుయ్ (122) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది.
3. కర్ణాటక vs జార్ఖండ్
దేవదత్ పడిక్కల్(147) సూపర్ సెంచరీతో 5 వికెట్లతో కర్ణాటక విజయం. జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (125) శతంక వృథా
4.బీహార్ vs అరుణాచల్ ప్రదేశ్
బీహార్ 397 పరుగుల తేడాతో విజయం. బీహార్ రికార్డు స్కోరు (574/6). వైభవ్ సూర్యవంశీ (190) విధ్వంసం.
5. హైదరాబాద్ vs ఉత్తరప్రదేశ్
యూపీ 84 పరుగుల తేడాతో విజయం
6. జమ్మూ కశ్మీర్ vs చండీగఢ్
జమ్మూ కశ్మీర్ 10 వికెట్ల తేడాతో విజయం
7. బెంగాల్ vs విదర్భ
ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బెంగాల్ 3 వికెట్ల తేడాతో విజయం
8. కేరళ vs త్రిపుర
కేరళ 145 పరుగుల తేడాతో విజయం
9. మధ్యప్రదేశ్ vs రాజస్థాన్
మధ్యప్రదేశ్ 99 పరుగుల తేడాతో విజయం
10. సౌరాష్ట్ర vs ఒడిశా
సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో విజయం. స్వస్తిక్ సమల్ (212) డబుల్ సెంచరీ చేసినా ఒడిశాకు తప్పని ఓటమి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications