Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి భారీ బహుమతి!

టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్‌పై బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన స్పూర్తిదాయకమైన తండ్రి అంటూ కొనియాడారు. థార్ ఎస్‌యూవీ కారును బహుమతిగా అందజేయాలనుకుంటున్నానని ఎక్స్‌వేదికగా ప్రకటించారు.
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌తో సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా అర్థ సెంచరీ సాధించిన భారత ప్లేయర్‌గా హార్దిక్ పాండ్యా సరసన నిలిచాడు.

గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా పిలుపును అందుకోవడంతో భారత్ తరఫున ఆడాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా అరంగేట్ర క్యాచ్ అందుకున్నాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న అతని తండ్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. కొడుకు తొలి కోచ్‌గా క్రికెట్ పాఠాలు నేర్పిన నౌషద్ ఖాన్.. అతని కెరీర్ కోసం ఎంతో కష్టపడ్డాడు. సర్ఫరాజ్ ఖాన్‌కు ఎంతో అండగా నిలిచాడు.

 Anand Mahindra to gift Sarfaraz Khan and his father THAR-SUV following stellar debut in Rajkot

ఈ క్రమంలోనే అరంగేట్ర క్యాప్ అందుకోగానే సర్ఫరాజ్ ఖాన్.. దాన్ని తీసుకొని తండ్రి చేతిలో పెట్టాడు. ఈ సన్నివేశాలన్నీ నెట్టింట వైరల్‌గా మారి అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే సర్ఫరాజ్ ఖాన్ కంటే అతని తండ్రిని ఆనంద్ మహీంద్రా అభినందించారు. అతనికే ఎస్‌యూవీ ధార్ కారును బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని తెలిపారు.

'అవకాశాలు రాలేదని సహనం కోల్పోవద్దు... ధైర్యంగా ఉండాలి! కఠోర శ్రమ, తెగువ, ఓర్పు... ఇవే విజయానికి బాటలు. పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేందుకు ఇంతకంటే మెరుగైన లక్షణాలు ఇంకేం ఉంటాయి? తన పిల్లలకు ఓ స్ఫూర్తిదాయక తండ్రిగా ఉన్న నౌషాద్ ఖాన్‌కు థార్ వాహనాన్ని బహుమతిగా ఇద్దామని అనుకుంటున్నాను. మా కానుకను అందుకునేందుకు నౌషాద్ ఖాన్ అంగీకరిస్తే అందుకు ఎంతో సంతోషిస్తాం... మాకు దక్కిన గౌరవంగా భావిస్తాం'అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా ఇలా థార్ కారులను బహుమతులుగా ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2021 ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత కుర్రాళ్లందరికీ థార్ కారు అందజేశారు. మహమ్మద్ సిరాజ్, నటరాజన్, శార్దూల్ ఠాకూర్, రిషభ్ పంత్‌, వాషింగ్టన్ సుందర్‌లకు థార్ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. అరంగేట్ర మ్యాచ్‌లో స్వేచ్చగా బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్(62).. జడేజా తప్పిదం కారణంగా రనౌటయ్యాడు.

Story first published: Friday, February 16, 2024, 16:22 [IST]
Other articles published on Feb 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+