బ్యాట్ కొరుకుతూ..
టీవీ కెమెరామెన్ దీన్ని చూపించడంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే ఇలా బ్యాటింగ్‌కు వచ్చే ముందు బ్యాట్‌ను కొరకడం ఇదే తొలిసారి కాదు. టీమిండియాకు ఆడిన సమయంలోనూ ధోనీ చాలా సందర్భాల్లో తన బ్యాట్‌ను కొరికేవాడు. అలవాటులో భాగంగానే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ధోనీ అదే చేశాడు. అయితే ధోనీ ఇలా ఎందుకు బ్యాట్ కొరుకుతున్నాడని, ఇందులో ఎదో రహస్యం ఉందని నెటిజన్లు సందేహం వ్యక్తం చేశారు.
క్లీన్‌గా ఉండాలనే..
అలా బ్యాట్‌ను కొరకడం వెనుక ఉన్న కారణాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా ట్విటర్ వేదికగా వెల్లడించాడు.'ధోనీ బ్యాట్ కొరకడంపై మీకు సందేహాలు ఉన్నాయా?.. అయితే వినండి. ధోనీ తన బ్యాట్‌పై ఏదైనా టేప్ ఉండే అవకాశం ఉంటుందని.. దానిని తొలగించడానికే నోటితో కొరుకుతుంటాడు. ప్రతీసారి బ్యాటింగ్‌కు వెళ్లడానికి ముందు బ్యాట్‌పై ఎలాంటి టేప్ లేదా థ్రెడ్ ఉండకూడదని ధోని అనుకుంటాడు. అందుకే మీరెప్పుడైనా ధోనీ బ్యాట్‌ను గమనించండి.. ఎలాంటి టేప్, థ్రెడ్ కనిపించవు.'అని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు.
కాన్వే, ధోనీ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో 91 పరుగుల భారీ తేడాతో చెన్నై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 87) భారీ ఇన్నింగ్స్ ఆడగా.. ధోనీ (8 బంతుల్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో 21 నాటౌట్) సూపర్ ఫినిష్ అందించాడు. ఈ ఇద్దరి విధ్వంసానికి తోడుగా రుతురాజ్ గైక్వాడ్(33 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 41), శివమ్ దూబే(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ మార్ష్‌కు ఓ వికెట్ దక్కింది.

చెలరేగిన చెన్నై బౌలర్లు..
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ.. 17.4 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. మిచెల్ మార్ష్(25), రిషభ్ పంత్(21), శార్దూల్ ఠాకూర్(24), డేవిడ్ వార్నర్(19) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో మోయిన్ అలీ మూడు వికెట్లు తీయగా.. ముఖేష్ చౌదరి, సిమర్జీత్ సింగ్, డ్వేన్ బ్రావో రెండేసి వికెట్లు తీసారు. మహీశ్ తీక్షణ ఓ వికెట్ పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












