Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కశ్మీర్‌పై షాహిద్ అఫ్రిది చెత్త వాగుడు.. నీలా అబద్దాలు చెప్పరంటూ అమిత్ మిశ్రా కౌంటర్!

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ వేర్పాటువాదన్ని సమర్థిస్తూ మరోసారి అవాకులు చెవాకులు పేల్చిన పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదిపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అదిరిపోయే కౌంటరిచ్చాడు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌‌ను ఢిల్లీ పటియాలాలోని ఎన్‌ఐఏ కోర్టు దోషిగా తేల్చింది. అతనికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. అయితే యాసిన్ మాలిక్ అమాయకుడని, భారత్‌లో మానవ హక్కుల మీద గొంతెత్తుతున్న వారిని ఉగ్రవాదులుగా నేరం మోపుతున్నారని అతని శిక్షను తప్పుబడుతూ అఫ్రిది ట్వీట్ చేశాడు.

 యాసిన్ మాలిక్ అమాయకుడంటూ..

యాసిన్ మాలిక్ అమాయకుడంటూ..

'భారత్‌లో మానవ హక్కుల మీద గొంతెత్తుతున్నవారి గొంతు నొక్కడం కొనసాగుతూనే ఉంది. యాసిన్ మాలిక్ మీద నేరం మోపినంత మాత్రానా కశ్మీర్ స్వేచ్ఛ కోసం చేసే పోరు ఆగేది కాదు. కశ్మీరీ లీడర్ల మీద చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిని కోరుతున్నా.'అని అఫ్రిది ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌పై భారతీయులు భగ్గుమన్నారు. తమదైన రీతిలో అఫ్రిదికి బదులిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై స్పందించిన అమిత్ మిశ్రా.. యాసిన్ మాలిక్ నేరాన్ని ఒప్పుకున్నాడని.. నీలా అబద్దపు బర్త్ డేట్స్ చెప్పలేదని అఫ్రిదికి దిమ్మతిరిగే బదులిచ్చాడు.

నీలా అబద్దాలు చెప్పరు..

నీలా అబద్దాలు చెప్పరు..

'డియర్ షాహిద్ అఫ్రిది.. న్యాయస్థానంలో యాసిన్ మాలిక్ స్వయంగా తన నేరాన్ని అంగీకరించాడు. అందరూ నీలాగా బర్త్ డేట్ ను తప్పు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించరు.'అని అమిత్ మిశ్రా తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. గతంలో అఫ్రిది తన పుట్టిన రోజును తప్పుగా రాసి క్రికెట్ టోర్నీల్లో పాల్గొన్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఐసీసీ అధికారులనే అఫ్రిది తప్పుదారి పట్టించాడని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత.. ఐసీసీ అధికారులే తన పుట్టిన తేదీని తప్పుగా రాసుకున్నారని అఫ్రిది మాటమార్చాడు. కానీ అతడి మాటలు ఎవరూ నమ్మలేదు.

గతంలో కూడా..

గతంలో కూడా..

అయితే కశ్మీర్ పై అఫ్రిది కామెంట్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇదే తరహా కామెంట్స్‌తో భారత ఆటగాళ్ల ఆగ్రహానికి గురయ్యాడు. టీమిండియా మాజీ ఆటగాళ్లు గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌లు అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో యాసిన్ మాలిక్ తన నేరాన్ని అంగీకరించడంతో ఎన్‌ఐఏ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో మరణ శిక్ష విధించాలని ఎన్‌ఐఏ వాదించినప్పటికీ.. కోర్టు మాత్రం జీవిత ఖైదుకే మొగ్గు చూపింది.

Story first published: Wednesday, May 25, 2022, 20:08 [IST]
Other articles published on May 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+