హైదరాబాద్: ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు.. పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్దమవుతున్నారు. క్రికెటర్‌గా మైదానంలో పరుగుల మోత మోగించిన రాయుడు.. ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. ప్రజా నాడి తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు.
చెప్పా పెట్టకుండా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నాడు. సిటీలో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుంటున్నాడు. ప్రజా సమస్యలు కూడా వింటున్నాడు. వైఎస్సార్‌సీపీ ప్రభత్వం చేస్తున్న అభివృద్ది పనులను పరిశీలిస్తున్నారు.

మూడు రోజుల క్రితమే ఈ పర్యటనను ప్రారంభించిన రాయుడు శుక్రవారం తెనాలి రూరల్ మండలం కొంకలూరులో రైతు భరోసా కేంద్రాన్ని పరీశీలించారు. అక్కడి రైతులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం కొన్ని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించిన అంబటి రాయుడు విద్యార్ధులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశాడు.
అనంతరం మీడియాతో మాట్లాడిన రాయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను కొనియాడారు. ప్రభుత్వం చేస్తున్న పనులతో రైతులు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. వైఎస్స్‌ర్‌సీపీ తరఫున గుంటూరు పార్లమెంట్ స్థానానికి అంబటి రాయుడు పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తన పొలిటికల్ ఇన్నింగ్స్‌పై క్లారిటీ ఇచ్చిన రాయుడు.. ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాతే ఎక్కడి నుంచి పోటీ చేసే విషయం చెబుతానని తెలిపారు. రాజకీయంగా తాను చాలా తెలుసుకోవాల్సి ఉందని, పార్ట్‌టైమ్ పొలిటిషన్‌గా కాకుండా ప్రజా క్షేత్రంలోనే ఉంటూ ప్రజల కోసం పోరాడుతానని స్పష్టం చేశారు.
అంబటి రాయుడు స్వస్థలం గుంటూరు జిల్లా కాగా.. చిన్నతనంలోనే వారి కుటుంబం హైదరాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడే క్రికెటర్‌గా ఎదిగిన రాయుడు.. తొలుత హైదరాబాద్, ఆ తర్వాత ఆంధ్రా.. అక్కడి నుంచి బరోడా జట్టుకు దేశవాళీ క్రికెట్ ఆడాడు. 2010లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాయుడు 14 ఏళ్ల పాటు అభిమానులను అలరించాడు.