టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు విమర్శలు గుప్పించాడు. యువ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌పై హార్దిక్ పాండ్యా నమ్మకం ఉంచాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో 18వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీయడానికి హార్దిక్ పాండ్యా నిరాకరించాడు. స్ట్రైకింగ్ తానే ఉంచుకోవాలనే ఉద్దేశంతో పరుగు తీయలేదు.
అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. హార్దిక్ పాండ్యాను అంబటి రాయుడు తప్పు బట్టాడు. బ్యాటింగ్‌కు కఠినంగా ఉన్న వికెట్‌పై హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేసినా.. సింగిల్ తీయకుండా తప్పు చేశాడన్నాడు. ధ్రువ్ జురెల్‌పై కాస్త నమ్మకం ఉంచి సింగిల్ తీసి ఉంటే పలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఆఖరి ఓవర్‌లో జట్టుకు 25 పరుగులు అవసరమైనా.. హార్దిక్ సాధించేవాడని తెలిపాడు.

'హార్దిక్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఎందుకంటే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదు. అంతేకాకుండా మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడ్డాయి. దాంతో అతను ఆచితూచి ఆడి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఫినిషింగ్ టచ్ కూడా ఇవ్వాల్సింది. అతను కాస్త ధ్రువ్ జురెల్‌పై నమ్మకం ఉంచాల్సింది.
ఆఖరి ఓవర్‌లో 25 పరుగులు అవసరమైనా.. చేసే సామర్థ్యం హార్దిక్ పాండ్యాకు ఉంది. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే.. ధ్రువ్ జురెల్‌పై కాస్త నమ్మకం ఉంచి ఆఖరి ఓవర్ వరకు క్రీజులో ఉండి ఉంటే మ్యాచ్ మరింత హోరాహోరీగా మారేది. ఏది ఏమైనా హార్దిక్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.'అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రాజ్ కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 26 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దాంతో ఈ సిరీస్ ఆశలను ఇంగ్లండ్ 1-2తో సజీవంగా ఉంది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 పుణె వేదికగా శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.