Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఆర్‌సీబీ ఆటగాడు టీమిండియాను ఏలుతాడు: అంబటి రాయుడు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల జల్లు కురిపించాడు. గత నాలుగేళ్లలో ఊహించని రీతిలో రజత్ పాటిదార్‌ మెరుగయ్యాడని కొనియాడాడు. మరే ఆటగాడు కూడా ఈ స్థాయిలో ఇంప్రూవ్ కాలేదని కితాబిచ్చాడు. భవిష్యత్తులో టీమిండియా తరఫున కూడా గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడుతాడని జోస్యం చెప్పాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో రజత్ పాటిదార్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ 92 పరుగులతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

చాలా మెరుగయ్యాడు..

ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో షోలో ఈ మ్యాచ్ గురించి అంబటి రాయుడు మాట్లాడాడు. 'రజత్ పాటిదార్ అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు. పిచ్‌ను అర్థం చేసుకోవడానికి ఆరంభంలో కాస్త సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత తనదైన షాట్లతో చెలరేగాడు. ఆ షాట్లలోని ప్రత్యేకత ఏంటంటే.. ఇదే ఆటగాడు 2022 ప్లేఆఫ్స్‌లో కూడా సెంచరీ కొట్టాడు.

అప్పట్లో అతను బ్యాట్ ఫేస్ క్లోజ్ చేసి.. ఎక్కువగా ఆన్‌సైడ్ ఆడేవాడు. కానీ ఇప్పుడు టెక్నికల్ పరంగా చూస్తే అతను తన బ్యాట్ ఫేస్‌ను ఓపెన్ చేసి ఆడుతున్నాడు. అతని బ్యాట్ స్పీడ్ కూడా మెరుగైంది. గత నాలుగేళ్లలో ఏ ఆటగాడు కూడా ఈ స్థాయిలో ఇంప్రూవ్ అవ్వడం నేను చూడలేదు.

IPL 2026 Ambati Rayudu Says No Player Has Improved This Much in 4 Years Says on RCB Captain Rajat Patidar s Legendary Knock

ఇది ఒక లెజండరీ ఇన్నింగ్స్..

గతేడాదితో పోల్చి చూసినా కూడా.. చాలా మెరుగయ్యాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంటున్నాడు. తన బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకునేందుకు రజత్ పాటిదార్ తీవ్రంగా శ్రమించి ఉంటాడు. అలాగే ఇలాంటి ఇన్నింగ్స్ కోసం ఎదురు చూసినట్లున్నాడు. తన అనుభవాన్ని ఉపయోగించి జట్టుకు అవసరమైన పరిస్థితుల్లో అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.

ఐపీఎల్ చరిత్రలోనే ఇది ఒక లెజండరీ ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు తీవ్రమైన ఒత్తిడితో ఉంటాయి. ఇలాంటి ఇన్నింగ్స్‌లను మనం చాలా అరుదుగా చూస్తుంటాం. నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లను ఎదుర్కొంటూ ఎవరైనా ఇంత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు.

టీమిండియా తరఫున కూడా..

నా దృష్టిలో.. ఈ ఆటగాడు భవిష్యత్తులో కేవలం ఆర్‌సీబీ కోసమే కాకుండా టీమిండియా తరఫున కూడా గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడుతాడని ఆశిస్తున్నా. క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో అతను బ్యాటింగ్ చేసిన విధానం చూశాక, అతను ఇప్పుడు ఒక సరికొత్త లీగ్ బ్యాటర్ల జాబితాలోకి చేరిపోయాడనిపిస్తోంది. భవిష్యత్తులో అతను ఇంతకంటే మెరుగైన ఇన్నింగ్స్‌లు ఆడతాడని నేను భావిస్తున్నాను.

Story first published: Wednesday, May 27, 2026, 19:00 [IST]
Other articles published on May 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+